News March 12, 2025
ఉద్యోగులకు ₹33కోట్ల షేర్లు గిఫ్ట్‌గా ఇస్తున్న ప్రమోటర్

ఉద్యోగులకు తన షేర్లలో కొన్ని గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ప్రుడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రమోటర్ సంజయ్ షాకు సెబీ అనుమతి ఇచ్చింది. కంపెనీ ఆరంభించి 25ఏళ్లు కావడంతో కొన్నేళ్లుగా నిజాయతీగా సేవలందిస్తున్న 650 మందికి ₹33కోట్ల విలువైన 1,75,000 షేర్లను పంచాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందుకు ఒక చిన్న నిబంధన అడ్డంకిగా మారడంతో సెబీని సంప్రదించారు. ప్రస్తుతం ఒక్కో షేరు ధర రూ.1900గా ఉంది. మీ కామెంట్.
Similar News
News March 13, 2025
21 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు!

భరతమాత ముద్దుబిడ్డ సర్దార్ ఉద్దమ్ సింగ్ జలియన్‌వాలా బాగ్ దురాగతానికి ప్రతీకారం తీర్చుకుని నేటికి 85 ఏళ్లు పూర్తయ్యాయి. 1919లో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ డయ్యర్ పాలనలో బ్రిటిషర్లు దాదాపు 400 మంది పౌరులను దారుణంగా చంపారు. ఇందుకు ప్రతీకారంగా ఉద్దమ్ 1940 మార్చి 13న లండన్‌లో డయ్యర్‌ను కాల్చి చంపారు. దీంతో 1940 జులై 31న అతడిని ఉరి తీశారు. సింగ్ ధైర్యానికి Shaheed-i-Azam అనే బిరుదు వచ్చింది.
News March 13, 2025
Stock Markets: ఆ రెండు రంగాల షేర్లు అదుర్స్

స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 22,504 (32), సెన్సెక్స్ 74,166 (140) వద్ద చలిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ సీజ్ఫైర్, గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడమే ఇందుకు కారణాలు. CPSE, PSE, ఎనర్జీ, చమురు, PSU బ్యాంకు, ఇన్ఫ్రా, కమోడిటీస్ షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. స్మాల్, మిడ్‌క్యాప్, ఆటో, రియాల్టి, మీడియా, ఐటీ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. BEL, ONGC టాప్ గెయినర్స్.
News March 13, 2025
పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.550 పెరిగి రూ.81,200లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.600 పెరగడంతో రూ.88,580కు చేరింది. అటు వెండి ధర కూడా నిన్న రూ.2వేలు, ఇవాళ రూ.1000 పెరగడంతో ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,10,000గా ఉంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.