News March 12, 2025
ఉద్యోగులకు ₹33కోట్ల షేర్లు గిఫ్ట్‌గా ఇస్తున్న ప్రమోటర్

ఉద్యోగులకు తన షేర్లలో కొన్ని గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ప్రుడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రమోటర్ సంజయ్ షాకు సెబీ అనుమతి ఇచ్చింది. కంపెనీ ఆరంభించి 25ఏళ్లు కావడంతో కొన్నేళ్లుగా నిజాయతీగా సేవలందిస్తున్న 650 మందికి ₹33కోట్ల విలువైన 1,75,000 షేర్లను పంచాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందుకు ఒక చిన్న నిబంధన అడ్డంకిగా మారడంతో సెబీని సంప్రదించారు. ప్రస్తుతం ఒక్కో షేరు ధర రూ.1900గా ఉంది. మీ కామెంట్.
Similar News
News March 13, 2025
HMDA పరిధి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

TG: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(HMDA) పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 3వేల చ.కి.మీ భూభాగం చేర్చుతున్నట్లు పేర్కొంది. దీంతో మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండలోని 16 మండలాలు విలీనం కానున్నాయి. ప్రస్తుతం HMDA పరిధిలో 11 జిల్లాలు, 104 మండలాలు, 1350 గ్రామాలు ఉన్నాయి.
News March 13, 2025
కళ తప్పిన గోవా టూరిజం.. కారణాలు ఇవే!

ఒకప్పుడు విదేశీ పర్యాటకులతో కళకళలాడిన గోవా ప్రస్తుతం వెలవెలబోతోంది. 2019లో 85 లక్షల మంది రాగా, 2023లో 15 లక్షల మంది మాత్రమే సందర్శించారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆగ్నేయాసియాలో మరింత తక్కువ ధరలకు పట్టణాలు అందుబాటులో ఉండడం, గోవాలో ఆటో, ట్యాక్సీ మాఫియా, ఇక్కడ జీవన వ్యయం పెరగడం వల్ల విదేశీ టూరిస్టులు తగ్గారని సమాచారం. దీనిని పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది.
News March 13, 2025
BREAKING: పోసానికి బిగ్ షాక్

AP: నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఐడీ నమోదు చేసిన కేసులో ఆయనకు గుంటూరు కోర్టు ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోసానిని గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. నిన్నటివరకు నాలుగు కేసుల్లో బెయిల్ వచ్చిన పోసాని త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని అంతా భావించగా, ఊహించని విధంగా మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది.