News June 18, 2024

10 వేల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్!

image

TG: రాష్ట్రంలోని 10వేల మంది ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. ఈ ఆదేశాలతో భాషా పండితులు, స్కూల్ అసిస్టెంట్ భాషా ఉపాధ్యాయులు, పీఈటీలు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్లు కానున్నారు. వీరితో పాటు SGTలూ పదోన్నతి పొందే అవకాశం ఉంది.

Similar News

News November 18, 2025

హిడ్మాకు బహుభాషల్లో పట్టు

image

మడావి హిడ్మా మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్త. తెలంగాణ కమిటీ, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(PLGA)కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్‌ అనే పేర్లు ఉన్నాయి. మురియా తెగకు చెందిన ఆయనకు హిందీ, గోండు, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో పట్టుంది. కొద్దిరోజులుగా అతడు లొంగిపోతాడనే ప్రచారం జరిగినా ఈ ఉదయం అల్లూరి జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

YCP అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి అరెస్టు

image

AP: YCP అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డిని HYDలోని తన ఇంట్లో ఈ ఉదయం ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారిపై రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. కాగా పరకామణి కేసులో కీలకంగా ఉన్న సతీశ్ మృతిపై వెంకట్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని అనంతపురం టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.