News June 28, 2024

18,942 మంది టీచర్లకు ప్రమోషన్లు

image

TG: రాష్ట్రంలోని 18,942 మంది టీచర్ల ప్రమోషన్ల కల నెరవేరింది. చట్టపరమైన వివాదాలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో ప్రమోషన్స్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. మల్టీజోన్‌1లో 10,083 మంది SGTలు స్కూల్‌ అసిస్టెంట్లుగా, 1,094 మంది స్కూల్‌ అసిస్టెంట్లు HMలుగా ప్రమోషన్ పొందారు. మల్టీజోన్‌2లో SGT నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌లుగా 6,989 మంది, 776 మంది స్కూల్‌ అసిస్టెంట్లు HMలు అయ్యారు.

Similar News

News December 2, 2025

శ్రీలంకకు పాక్ సాయం.. ఎక్స్‌పైరీ ఫుడ్ అంటూ!

image

శ్రీలంకలో వరదలు బీభత్సం సృష్టించిన నేపథ్యంలో అక్కడి ప్రజలను ఆదుకునేందుకు ఇప్పటికే భారత ప్రభుత్వం అత్యవసర మానవతా సాయాన్ని అందించింది. అయితే ఇది చూసిన పాకిస్థాన్ ప్రభుత్వం కూడా శ్రీలంకకు ఫుడ్ ప్యాకేజీలను పంపింది. ఈ విషయాన్ని అక్కడి పాక్ హైకమిషనర్ కార్యాలయం ట్వీట్ చేయగా.. ఎక్స్‌పైరీ ఫుడ్ పంపినట్లు నెటిజన్లు గుర్తించారు. ఇలా పాడైపోయిన వాటిని పంపి డప్పు కొట్టుకోవడం ఎందుకంటూ మండిపడుతున్నారు.

News December 2, 2025

వంటింటి చిట్కాలు మీకోసం

image

* పిజ్జా చల్లబడి, గట్టిపడితే ఒక గిన్నెలో పిజ్జా ముక్కలు పెట్టి.. మరో గిన్నెలో వేడి నీళ్లు పోసి, అందులో పిజ్జాముక్కల గిన్నెను 5 నిమిషాలు ఉంచితే చాలు.
* ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్లు మండుతుంటే ఒక టిష్యూ పేపర్‌ను తడిపి, దానిపై ఉల్లిగడ్డను కట్ చేస్తే కళ్లు మండవు.
* గిన్నెలు మాడిపోయినప్పుడు ఓ గ్లాస్ పెప్సీని మాడిపోయిన గిన్నెలో పోసి వేడి చేసి, 10 నిమిషాల తర్వాత కడిగితే గిన్నెలు మెరిసిపోతాయి.

News December 2, 2025

సమంత రెండో పెళ్లి.. మేకప్ స్టైలిస్ట్ షాకింగ్ పోస్ట్

image

సమంత-రాజ్ <<18438537>>పెళ్లి<<>> నేపథ్యంలో సామ్‌కు పర్సనల్ మేకప్ స్టైలిస్ట్‌గా పనిచేసిన సాధనా సింగ్ చేసిన ఇన్‌స్టా పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ‘విక్టిమ్‌గా విలన్ బాగా నటించారు’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆమె సమంతనే విలన్‌గా పేర్కొన్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో వీరు క్లోజ్‌గా ఉండేవారని, ఇప్పుడు ఏమైందని చర్చించుకుంటున్నారు. నిన్న నటి పూనమ్ కౌర్ చేసిన <<18440323>>ట్వీట్<<>> సైతం వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.