News August 26, 2025

RTC ఉద్యోగులకు ప్రమోషన్లు.. సీఎం గ్రీన్ సిగ్నల్

image

APSRTC ఉద్యోగుల పదోన్నతులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీంతో డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ ఉద్యోగులతో పాటు సూపర్‌వైజర్ కేడర్ వరకు అర్హులైన ఉద్యోగులకు ప్రమోషన్లు రానున్నాయి. సుమారు 3 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలాఖరుకు GO విడుదలై, సెప్టెంబరు 1 నుంచి ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.

Similar News

News August 27, 2025

చైనా పట్ల ట్రంప్ డబుల్ యాక్షన్!

image

చైనా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డబుల్ యాక్షన్ చేస్తున్నారు. ఓ వైపు 200% టారిఫ్స్ వడ్డిస్తామంటూనే మరోవైపు 6 లక్షల మంది చైనీస్ విద్యార్థులను చదువుకునేందుకు ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు. కాగా ఇటీవల భారత్, చైనా పట్ల యూఎస్ కఠిన వైఖరి ప్రదర్శించింది. ఇంతలో మళ్లీ యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

News August 27, 2025

క్యాబినెట్ భేటీ 30కి వాయిదా

image

తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. తొలుత ఈనెల 29న క్యాబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. దాన్ని ఈనెల 30కి రీషెడ్యూల్ చేసింది. ఆ రోజు మ.ఒంటి గంటకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రివర్గం సమావేశం కానుంది. కాగా అదే రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.

News August 27, 2025

ఖైరతాబాద్ గణేశుడి పూర్తి రూపం

image

TG: వినాయక నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్ ఖైరతాబాద్ మహాగణపతి సిద్ధమయ్యాడు. ఇవాళ ఆయన తొలి ఫొటో బయటకు వచ్చింది. ఇన్ని రోజులు నిర్మాణ దశలో కర్రలు ఉండగా ఇప్పుడు వాటిని తొలగించి స్వామివారి రూపాన్ని ఆవిష్కరించారు. ఈ ఏడాది మహాగణపతి ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’గా పూజలందుకోనున్నారు. 69 అడుగుల ఎత్తైన విఘ్నేశ్వరుడి దర్శనానికి లక్షలాది మంది తరలిరానున్నారు.