News May 29, 2024
పక్కాగా ‘ఓట్ల లెక్కింపు’ ఏర్పాట్లు: ఏపీ సీఈవో
AP: రాష్ట్రంలో పక్కగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతుందని ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా అన్నారు. 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల లెక్కింపు, 61 నియోజకవర్గాల్లో 21నుంచి 24 రౌండ్లు, 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం అదనపు టేబుళ్లు ఏర్పాటు చేశామని
ఆయన వివరించారు.
Similar News
News January 19, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు బాగుంది: వెంకటేశ్ ప్రసాద్
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ Xలో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇది మంచి స్క్వాడ్. 3 లీగ్ మ్యాచ్‌లు, ఆపై 2 నాకౌట్‌లతో కూడిన షార్ట్ టోర్నమెంట్. ఇండియా బాగా ఆడుతుందనిపిస్తుంది’ అని తెలిపారు. సచిన్, లారా, కోహ్లీల్లో గ్రేటెస్ట్ బ్యాటర్ ఎవరు అని అడగ్గా సచిన్ పేరు చెప్పారు. కపిల్ దేవ్, సచిన్‌లను గ్రేటెస్ట్ ఇండియన్ ప్లేయర్లన్నారు.
News January 19, 2025
IIT బాబాను ఆశ్రమం నుంచి పంపించేశారు!
మహాకుంభమేళాకు వచ్చిన IIT బాబా (అభయ్ సింగ్) SMలో వైరలైన విషయం తెలిసిందే. అయితే తాను ఉంటున్న ఆశ్రమం నుంచి పంపించేశారని ఆయన మీడియాతో తెలిపారు. ఆశ్రమ గురువు మహంత్ సోమేశ్వర్ పూరీని దూషించడమే దీనికి కారణమని తెలుస్తోంది. ‘అర్ధరాత్రి నిర్వాహకులు వెళ్లిపోవాలన్నారు. తనకు మతిస్థిమితం లేదన్నారు. అక్కడ నాకంటే మానసిక స్థితి తెలిసిన సైకాలజిస్టులు ఉన్నారా? నాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి’ అంటూ అభయ్ మండిపడ్డారు.
News January 19, 2025
రాజకీయాల్లోకి ‘కట్టప్ప’ కూతురు
ప్రముఖ నటుడు సత్యరాజ్ కూతురు దివ్య రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకే పార్టీలో చేరారు. ఆమె తమిళనాడులో ప్రముఖ పోషకాహార నిపుణులు (న్యూట్రిషనిస్ట్)గా గుర్తింపు పొందారు. కాగా సత్యరాజ్ బాహుబలి, బాహుబలి-2 సినిమాల్లో కట్టప్పగా నటించి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.