News September 7, 2024
భారత్‌లో ముషారఫ్ సంబంధీకుల ఆస్తి.. రూ.1.39 కోట్లకు వేలం

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సన్నిహితుల ఆస్తిని భారత్ ఈ నెల 5న రూ.1.39 కోట్లకు వేలం వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఆయన సంబంధీకుల పేరిట ఆస్తి ఉంది. స్థానిక రైతులు ముగ్గురు కలిసి దాన్ని కొనుగోలు చేశారు. 2010లో ఆ ఆస్తిని ‘శత్రువుల ఆస్తి’గా భారత్ ప్రకటించింది. అప్పటి నుంచీ ఇది ‘ఎనిమీ ప్రాపర్టీ కస్టోడియన్ ఆఫీస్’ అధీనంలోనే ఉంది. కాగా.. ముషారఫ్ గత ఏడాది మరణించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 23, 2025
VKB: జిల్లాలో 594 జీపీలకు రిజర్వేషన్లు ఖరారు

జిల్లాలో 594 గ్రామపంచాయతీలకు లాటరీ ద్వారా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా అధికారులు, నాయకుల సమక్షంలో గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లను లాటరీ ద్వారా ఖరారు చేశారు. తాండూర్ డివిజన్ 8 మండలాల్లో 262 గ్రామపంచాయతీలకు వికారాబాద్ డివిజన్లో 12 మండలాలకు 332 గ్రామపంచాయతీలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు.

మక్తల్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ: మంత్రి

మక్తల్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ఎన్ఆర్పీటీ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కొనసాగుతోందని తెలిపారు.