News April 11, 2024
ఏపీలో రూ.100కోట్ల విలువైన సొత్తు జప్తు

AP: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రూ.100 కోట్ల విలువైన నగదు, సొత్తును జప్తు చేశామని ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా ప్రకటించారు. వీటిలో మద్యం, డ్రగ్స్, ఆభరణాలు వంటివి ఉన్నాయన్నారు. అంతర్రాష్ట్ర చెక్పోస్టులతో పాటు పలు తనిఖీ కేంద్రాల ద్వారా నగదు రవాణాపై కన్నేసి ఉంచామని తెలిపారు. గడచిన 24 గంటల్లోనే రూ.1.97కోట్ల విలువైన సొత్తును జప్తు చేశామని పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
ఒకే కుటుంబంలో 18 మంది మృతి

సౌదీలో ఘోర <<18310005>>బస్సు<<>> ప్రమాదం HYDలో పెను విషాదాన్ని నింపింది. మృతులంతా HYD వాసులే కాగా రాంనగర్లోని నసీరుద్దీన్ ఫ్యామిలీకి చెందిన 18 మంది మరణించడం తీవ్రంగా కలిచివేస్తోంది. నసీరుద్దీన్ 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఆయన కుమారుడు సిరాజుద్దీన్ మాత్రం ఉద్యోగరీత్యా USలో ఉంటున్నాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో అతనొక్కడే మిగిలాడని వారి బంధువులు Way2Newsకు వెల్లడించారు.

క్యాబినెట్ భేటీ ప్రారంభం

తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రజాకవి అందెశ్రీకి మంత్రి మండలి సంతాపం తెలిపింది. ఈనెల 24లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ్టి భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.