News February 3, 2025
70-90 పని గంటల ప్రతిపాదన పరిగణించట్లేదు: కేంద్రం

వారానికి 70-90 పని గంటల ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల కొందరు కార్పొరేట్ కంపెనీల అధినేతలు పని గంటలపై కామెంట్లు చేసిన నేపథ్యంలో లోక్‌సభలో పలువురు MPలు దీనిపై ప్రశ్నించారు. కేంద్ర సహాయ మంత్రి శోభ కరండ్లజే స్పందించి పైవిధంగా రాతపూర్వక వివరణ ఇచ్చారు. వారానికి 60గంటలకు మించి ఆఫీసుల్లో పని చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని ఇటీవల ఆర్థిక సర్వే తెలిపింది.
Similar News
News March 6, 2026
తెలంగాణకు కొత్త గవర్నర్

కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించింది. తెలంగాణకు శివ ప్రతాప్ శుక్లాను అపాయింట్ చేసింది. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు. ఇక TG గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. నాగాలాండ్ గవర్నర్‌గా నంద్ కిశోర్ యాదవ్, బిహార్ గవర్నర్‌గా సయ్యద్ హస్నేన్, బెంగాల్ గవర్నర్‌గా R.N. రవిని నియమించింది.
News March 6, 2026
దీదీకి కొత్త తలనొప్పి?

ఎన్నికల వేళ బెంగాల్ గవర్నర్‌గా ఆర్ఎన్ <<19306866>>రవి<<>> రావడంపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. 2021లో తమిళనాడుకు గవర్నర్‌గా వచ్చిన రవి డీఎంకే ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. రాష్ట్ర పాలసీను విభేదించడం, బిల్లులు ఆమోదించకపోవడం వంటివి చేసి వివాదాలకు కేరాఫ్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో బెంగాల్ గవర్నర్‌గా రవి వైఖరి ఎలా ఉంటుందోనని తృణమూల్ వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
News March 6, 2026
ఆయిల్ ధరల ప్రభావం జీడీపీపై ఉంటుందా?

క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం భారత జీడీపీపై ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ధర 10 డాలర్లు పెరిగిన ప్రతీసారి 0.5% జీడీపీ దెబ్బతింటుందంటున్నారు. ఇప్పటికే ముడి చమురు ధర 10 డాలర్ల వరకు పెరిగిందని.. ఆ ఎఫెక్ట్ జీడీపీపైన ఉంటుందన్నారు. వారం రోజుల్లోనే $69గా ఉన్న బ్యారెల్ ముడిచమురు ధర $78కు పెరిగిందని.. మిడిల్ఈస్ట్‌లో ఉద్రిక్తతలు కొనసాగితే అది చమురు ధర $87కు చేరొచ్చని అంచనా వేస్తున్నారు.


