News September 17, 2024
విమానాల్లో కన్నడ భాషలోనే మొదటి ప్రకటన చేయాలంటూ ప్రతిపాదన

బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్/టేకాఫ్ అయ్యే ప్రతి విమానంలో మొదటి ప్రకటనను కన్నడలోనే చేయాలని కన్నడ సాహిత్య పరిషత్ కోరింది. ఈ ప్రతిపాదనను సంస్థ ఛైర్మన్ డా.మహేశ్ జోషి సోమవారం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఎండీ హరి మరార్ ముందుంచారు. అయితే, దీనికి కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతి తప్పనిసరని, ఆ మేరకు అనుమతి కోసం లేఖ రాస్తామని అధికారులు తెలిపారు.
Similar News
News December 18, 2025
అసభ్యంగా నివేద ఫొటోలు.. స్పందించిన హీరోయిన్

AI జనరేటెడ్ ఫొటోల <<18592227>>బెడద<<>> హీరోయిన్లను పట్టి పీడిస్తోంది. తాజాగా నివేదా థామస్ ఫొటోలను అసభ్యకరంగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఇది తన గోప్యతపై దాడి అంటూ ట్వీట్ చేశారు. వీటిని పోస్ట్ చేసినవారు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరంగా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. కాగా ఇటీవల పలువురు హీరోయిన్ల ఫొటోలూ ఇలాగే వైరల్ అయ్యాయి.
News December 18, 2025
నేడు మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం!

TG: మరో ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ నేడు తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. పోచారం శ్రీనివాస్రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్పై దాఖలైన పిటిషన్లపై విచారణ ఇప్పటికే ముగిసింది. మరోవైపు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. కాగా ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాల్లేవని <<18592868>>అనర్హత<<>> పిటిషన్లను స్పీకర్ కొట్టేసిన విషయం తెలిసిందే.
News December 18, 2025
పౌరసత్వం వదులుకుంటున్న భారతీయులు

భారత పౌరసత్వాన్ని వదులుకుని విదేశాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. గత ఐదేళ్లలో దాదాపు 9 లక్షల మంది భారతీయులు పౌరసత్వం వదులుకున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. 2022 నుంచి ఏడాదికి 2లక్షలకు పైగా భారతీయులు దేశాన్ని వీడారు. వీరిలో సంపన్నులు, నిపుణులు, మేధావులు ఎక్కువగా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. ప్రపంచంలోనే అత్యధిక పౌరులను కోల్పోతున్న దేశాల్లో భారత్ టాప్లో కొనసాగుతోంది.


