News February 5, 2025
ఏపీలో మిరప బోర్డు కోసం ప్రతిపాదనలు

APలో మిర్చి బోర్డు ఏర్పాటు కోసం తమకు ప్రతిపాదనలు వచ్చినట్లు కేంద్ర వాణిజ్య శాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం సుగంధ ద్రవ్యాల బోర్డే దేశంలో మిర్చి ఉత్పత్తి, పరిశోధన, నాణ్యతా నిర్వహణ, దేశీయ మార్కెట్, ఎగుమతులు, ప్రోత్సాహకాలు సహా పలు విషయాలను పర్యవేక్షిస్తోందని తెలిపారు. మిర్చి నిల్వ పద్ధతులు, మార్కెట్ లింకేజ్ సహా ఇతర అంశాలపై రైతులు, వ్యాపారులకు ఈ బోర్డే సహాయం అందిస్తోందని వెల్లడించారు.
Similar News
News December 12, 2025
ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

AP: అల్లూరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు <<18539107>>ప్రమాదంపై<<>> సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు తక్షణమే ఘటనాస్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
News December 12, 2025
మహిళల్లో ఐరన్ లోపం లక్షణాలివే..

మహిళల్లో ఐరన్ లోపం ఉంటే అలసట, బలహీనత ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జుట్టు ఎక్కువగా రాలడం కూడా ఐరన్ లోపానికి సంకేతాలే. దీన్ని తగ్గించడానికి పాలకూర, బీట్రూట్, పప్పులు, మాంసం, గుడ్లు, డ్రై ఫ్రూట్స్, విత్తనాలు తీసుకోవాలి. అలాగే టమిన్-సి ఐరన్ శోషణకు సహాయపడుతుంది. నారింజ, నిమ్మకాయ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ వంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
News December 12, 2025
టీమ్ఇండియా చెత్త రికార్డ్

టీ20ల్లో 210+ పరుగుల ఛేదనలో భారత జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు 7 సార్లు ప్రత్యర్థి జట్లు 210+ స్కోర్లు చేయగా, అన్నింటిలోనూ భారత్ ఓడింది. నిన్న సౌతాఫ్రికా 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, 162 రన్స్కే టీమ్ఇండియా ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. 2023లో విశాఖలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో భారత్ 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటివరకు IND హయ్యెస్ట్ ఛేజింగ్ స్కోర్.


