News January 20, 2025
లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ప్రతిపాదనలు.. హైకమాండ్ సీరియస్

AP: నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ నేతలు చేస్తున్న డిమాండ్లపై అధిష్ఠానం సీరియస్ అయింది. ఈ అంశంపై పార్టీ నేతలు ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించింది. ఎవరూ మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేయవద్దని హెచ్చరించింది. కూటమి నేతలు చర్చించుకున్నాకే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని తేల్చి చెప్పింది.
Similar News
News November 22, 2025
కాకినాడ: అటవీశాఖ కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన

ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా కాకినాడకు చెందిన విద్యార్థులు కాకినాడ జిల్లా అటవీశాఖ కార్యాలయాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ ఎన్. రామచంద్రరావు వారికి అటవీశాఖ కార్యక్రమాలపై, అలాగే వన్యప్రాణుల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి, వారి సందేహాలను నివృత్తి చేశారు.
News November 22, 2025
‘వారణాసి’ బడ్జెట్ రూ.1,300 కోట్లు?

రాజమౌళి-మహేశ్‌బాబు కాంబోలో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ బడ్జెట్ దాదాపు ₹1,300Cr ఉండొచ్చని నేషనల్ మీడియా వెల్లడించింది. ఇప్పటివరకు రూపొందిన భారీ బడ్జెట్ భారతీయ చిత్రాల్లో ఇది ఒకటని తెలిపింది. అయితే నితీశ్ తివారి-రణ్వీర్ కపూర్ ‘రామాయణం’, అట్లీ-అల్లు అర్జున్ ‘AA22xA6’ మూవీల బడ్జెట్(₹1500Cr-₹2000Cr రేంజ్) కంటే ఇది తక్కువేనని పేర్కొంది. కాగా బడ్జెట్‌పై వారణాసి మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.
News November 22, 2025
దూసుకొస్తున్న అల్పపీడనం.. ఎల్లో అలర్ట్

AP: దక్షిణ అండమాన్ సముద్రం-మలక్కా మధ్య అల్పపీడనం ఏర్పడినట్లు IMD వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈ నెల 24న వాయుగుండంగా మారి మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.


