News May 19, 2024

ఈడీ, సీబీఐని మూసివేసేందుకు ప్రతిపాదిస్తా: అఖిలేశ్

image

కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈడీ, సీబీఐని మూసివేసేందుకు తాను ప్రతిపాదిస్తానంటూ SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతి రాష్ట్రంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) ఉంది. అలాంటప్పుడు ఈడీ, సీబీఐ ఎందుకు. మోసానికి పాల్పడితే ఆదాయపన్ను శాఖ చూసుకుంటుంది’ అని ఆయన తెలిపారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.

Similar News

News October 19, 2025

నోబెల్ అవార్డు గ్రహీత కన్నుమూత

image

నోబెల్ అవార్డు గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త చెన్ నింగ్ యంగ్ కన్నుమూశారు. 1922లో జన్మించిన ఆయన కణ భౌతిక శాస్త్రంలో సైంటిస్టుగా ఎదిగారు. 1957లో పరిశోధనలకు‌గానూ నోబెల్ బహుమతి అందుకున్నారు. 1964లో అమెరికా పౌరసత్వం పొందగా 2015లో వదులుకున్నారు. చైనా సంస్కృతి నరనరాల్లో ఉండటమే దానికి కారణమని ఓ సందర్భంలో చెప్పారు. ఆయన మరణాన్ని స్థానిక మీడియా ధ్రువీకరించింది.

News October 19, 2025

నేడు ఇలా చేస్తే చాలా మంచిది

image

నరక చతుర్దశి రోజున పొద్దున్నే లేచి, నువ్వుల నూనెతో తలంటుకుని, నెత్తిపై ఉత్తరేణి కొమ్మ ఉంచుకొని స్నానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ‘నల్ల నువ్వులతో ‘యమాయ తర్పయామి’ అంటూ యమ తర్పణాలు వదలాలి. ఇది నరకాసురుడు మరణించిన సమయం. ఈ తర్పణం, యమధర్మరాజు శ్లోక పఠనం ద్వారా పాపాలు హరించి, నరకం నుంచి రక్షణ లభిస్తుంది. ఇంట్లో ముగ్గులు వేసి, మినప వంటకాలు తినడం శుభప్రదం’ అని సూచిస్తున్నారు.

News October 19, 2025

దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి?

image

దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి తన తేజస్సుతో అజ్ఞానమనే చీకటిని తరిమివేసి, భక్తులను అనుగ్రహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పండుగ నాడు దీపాలు పెట్టి అమ్మవారిని ఆహ్వానించాలనే ఆచారాన్ని పాటిస్తున్నాం. దీనివల్ల మనపై దేవి అనుగ్రహం చూపుతారని, ఆర్థిక స్థితి మెరుగై, కుటుంబంలోని అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం.
* రోజూ ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.