News March 19, 2025
నాకు రక్షణ కల్పించండి: వివేకా హత్య కేసు నిందితుడు

AP: వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ కడప SPని కలిసి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఈ హత్య కేసులో నిందితులు జైల్లో నన్ను బెదిరించారు. నేను మాట్లాడే విషయాలు కొందరికి నచ్చట్లేదు. వైసీపీకి చెందిన కొందరు నన్ను బెదిరిస్తున్నారు. ‘హత్య’ సినిమాలో నన్ను క్రూరంగా చిత్రీకరించారు. ఆ మూవీలో నలుగురే చంపినట్లు చూపించారు. 8మందిని ఎందుకు చూపించలేదు?’’ అని ప్రశ్నించారు.
Similar News
News November 24, 2025
SRCL: ‘రేపు స్వయం సహాయక సంఘాలకు రూ. 300 కోట్లు’

రాష్ట్రంలోని 3,50,000 మహిళా స్వయంసహాయక సంఘాలకు మంగళవారం రూ.300.40 కోట్ల వడ్డీలేని రుణాలను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర డిప్యూటీ CM భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందిరమ్మ చీరెల పంపిణీ పురోగతి, వడ్డీలేని రుణాల పంపిణీ అంశంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సిరిసిల్ల అదనపు కలెక్టర్ కరీమా అగర్వాల్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని డిప్యూటీ CM తెలిపారు.
News November 24, 2025
మొబైల్ యూజర్లకు బిగ్ అలర్ట్

మొబైల్ యూజర్లకు టెలికం శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తమ పేరుతో ఉన్న SIM దుర్వినియోగం అయితే వినియోగదారులదే బాధ్యత అని స్పష్టం చేసింది. సిమ్ కార్డులను సైబర్ మోసాలు, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు వాడినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపింది. తమ ఐడెంటిటీతో లింక్ అయిన సిమ్ కార్డులు, డివైస్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. <<18316809>>IMEI<<>> నంబర్లను ట్యాంపర్ చేసిన ఫోన్లను ఉపయోగించవద్దని సూచించింది.
News November 24, 2025
టికెట్ ధరల పెంపు.. తప్పుగా తీసుకోవద్దు: మైత్రీ రవి

టికెట్ ధరల పెంపుపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మేము ఇండస్ట్రీ వృద్ధి కోసమే డబ్బును ఖర్చు చేస్తున్నాం. ఈ కారణంతో 6-7 సినిమాలకు టికెట్ ధరలు పెంచుతున్నాం. ఆ పెంపు రూ.100 మాత్రమే. ఈ అంశాన్ని తప్పుగా తీసుకోవద్దు’ అని చెప్పారు. కాగా టికెట్ ధరల పెంపుపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే.


