News July 26, 2024
నా వ్యభిచార గృహానికి రక్షణ కల్పించండి: లాయర్

TNలోని కన్యాకుమారిలో తన వ్యభిచార గృహానికి రక్షణ కల్పించాలని లాయర్ మురుగన్ మద్రాస్ HCలో పిటిషన్ వేయగా కోర్టు అవాక్కైంది. తాము పరస్పర సమ్మతితో సెక్స్ సర్వీస్ అందిస్తున్నామని వాదించారు. తనపై కేసు కొట్టేయాలని, తన వ్యాపారం జోలికి రాకుండా పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు. చట్టవిరుద్ధ వ్యాపారానికి భద్రత కోరినందుకు ఆగ్రహించిన కోర్టు మురుగన్‌కు ₹10వేల ఫైన్, సర్టిఫికెట్లు సమర్పించాలని ఆదేశించింది.
Similar News
News April 3, 2026
ప్రకృతి సేద్యం ‘అగ్ని అస్త్రం’ తయారీకి కావాల్సిన పదార్థాలు

ప్రకృతి సేద్యంలో కాండం, కాయ తొలిచే పురుగులు పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఆకుముడత, కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగు, వేరు పురుగుల నివారణకు అగ్నాస్త్రం బాగా ఉపయోగపడుతుంది. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు మూత్రం – 10 లీటర్లు ☛ పచ్చి పొగాకు – 1 కిలో ☛ పచ్చి వేపాకు 5 కిలోలు ☛ పచ్చి మిరపకాయలు 1 లేదా 2 కిలోలు ☛ వెల్లుల్లి పేస్టు – అర
News April 3, 2026
‘అగ్నాస్త్రం’ తయారీ విధానం, వినియోగం

పొగాకు, వేపాకు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లిని మెత్తగా నూరి ఒక పాత్రలో వేసి 10 లీటర్ల ఆవు మూత్రం కలపాలి. దీన్ని పొయ్యి మీద 5 పొంగులు వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత పొయ్యి మీద నుంచి దించి గుడ్డ/గన్నీ సంచితో కప్పాలి. 48 గంటలు చల్లారాక వడగట్టి భద్రపరుచుకోవాలి. అవసరమైన సమయంలో ఎకరానికి 100 లీటర్ల నీటిలో 2 లేదా రెండున్నర లీటర్ల అగ్నాస్త్రం కలిపి పంటలపై పిచికారీ చేయాలి. ఇది 3 నెలల పాటు నిల్వ ఉంటుంది.
News April 3, 2026
ఎంత మంది భూ కక్ష్యను దాటి వెళ్లారో తెలుసా?

నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆర్టెమిస్-2’ <<19542665>>ప్రయోగం<<>>లో భాగంగా నలుగురు వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనున్నారు. ఇప్పటిదాకా 24 మంది మాత్రమే భూకక్ష్యను దాటి ప్రయాణించారు. వీరంతా 1968-72 మధ్య అపోలో యాత్రల్లో భాగంగా వెళ్లిన అమెరికా ఆస్ట్రోనాట్లే కావడం గమనార్హం. వీరిలో 12 మంది చంద్రుడిపై అడుగుపెట్టారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనుషులు చంద్రుడి కక్ష్యలోకి వెళ్తున్నారు.


