News August 14, 2024

వైద్యుల ర‌క్ష‌ణ స‌మాజం బాధ్య‌త‌

image

కోల్‌క‌తాలో ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచార ఘ‌ట‌న త‌రువాత ప్రాణాలు కాపాడే వైద్యుల ర‌క్ష‌ణ గురించి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు స్పందించ‌క‌పోవ‌డంపై ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. తీవ్ర ఒత్తిడిలో పని చేసే వైద్యుల‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త స‌మాజంలో అంద‌రిపై ఉంద‌ని వైద్య వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. దీనిపై ప్ర‌తిఒక్క‌రూ గొంతెత్తాల‌ని కోరుతున్నాయి.

Similar News

News October 14, 2025

చిన్నారుల ప్రాణం ఖరీదు 10% కమీషన్!

image

MPలో కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ తాగి 23 మంది చిన్నారులు చనిపోవడం తెలిసిందే. వీరికి ఆ దగ్గు మందు ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ ప్రవీణ్ సోనీ సంపాదించింది ఎంతో తెలుసా? ఒక్కో బాటిల్‌ ధర రూ.24.54 కాగా Sresan కంపెనీ నుంచి అతడికి వచ్చేది 10% కమీషన్‌(రూ.2.54). ప్రభుత్వ డాక్టర్ అయినప్పటికీ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసేవాడు. ప్రమాదకరమని తెలిసినా సోనీ రిపీటెడ్‌గా కోల్డ్రిఫ్ ప్రిస్క్రైబ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

News October 14, 2025

30 తర్వాత మహిళల ఎముకలు గుల్లే

image

మహిళల్లో 30ఏళ్ల తర్వాత ఎముకలు గుల్లబారే ముప్పు ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఎముకలు 30 ఏళ్ల వయసుకు దృఢత్వానికి చేరుకుని తర్వాత బలహీనపడతాయని చెబుతున్నారు. కాబట్టి 30లోపే ఎముక సాంద్రత గరిష్ఠంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు. దీనికోసం స్ట్రెంగ్త్ ట్రైనింగ్, హెల్తీ లైఫ్‌స్టైల్ అలవాటు చేసుకోవాలి. ఆహారంలో బాదం, జీడిపప్పు, గుమ్మడి విత్తనాలు, పాలకూర, బ్రొకొలి, సోయాబీన్స్‌ చేర్చుకోవాలి. <<-se>>#Womenhealth<<>>

News October 14, 2025

ఈ నెలాఖరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా కవిత యాత్ర

image

TG: జాగృతి చీఫ్ కవిత రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. అన్ని జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను ఈ నెలాఖరు నుంచి ప్రారంభిస్తానని తెలిపారు. ఇందులో భాగంగా విద్యావంతులు, మేధావులతో సమావేశాలు నిర్వహించనున్నారు. జాగృతి యూత్ ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లాల నాయకులకు నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. షెడ్యూల్, సమావేశాల వివరాలతో రేపు యాత్ర పోస్టర్‌ను రిలీజ్ చేస్తారని సమాచారం.