News November 5, 2024

మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ

image

AP: ఐదేళ్లలో జరిగిన తప్పులను సరిదిద్దడంపై దృష్టి పెట్టామని DGP ద్వారకా తిరుమలరావు తెలిపారు. ‘గతంలో ఓ పార్టీ ఆఫీసుపై దాడి జరిగితే ఒక్కరినీ అరెస్టు చేయలేదు. తప్పు జరిగితే 30ఏళ్ల తర్వాతైనా చర్యలు తీసుకోవచ్చు’ అని చెప్పారు. మానవ హక్కులు, మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండేలా పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తామని పేర్కొన్నారు.

Similar News

News February 2, 2026

రూ.9.8 కోట్ల లెక్కలేవి? KCRకు సిట్ ప్రశ్న!

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ముందు సిట్ అధికారులు కీలక విషయాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కోసం ఇంటెలిజెన్స్ టీం అత్యాధునిక పరికరాలు వాడిందని, వాటి విలువ దాదాపు రూ.9.8 కోట్ల వరకు ఉంటుందని కేసీఆర్ ముందు వివరాలు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పరికరాల కొనుగోలు లెక్కల గురించి ఆయనను సిట్ ప్రశ్నించగా ఈ విషయం తనకు తెలియదంటూ KCR సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.

News February 2, 2026

నేతలు అలాంటి భాష మాట్లాడకూడదు: హైకోర్టు

image

AP: రాజకీయాల్లో దూషణలు, వ్యక్తిగత దాడులు ఎక్కువవుతుండటం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలపై హైకోర్టు రాజకీయ నేతలకు హితవు పలికింది. ప్రజా జీవితంలో రాజకీయ నాయకులు ఎంతో హుందాగా వ్యవహరించాలని పేర్కొంది. మాజీమంత్రి అంబటి రాంబాబు <<19023876>>భార్య<<>> వేసిన హౌస్ మోషన్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. నేతలు అలాంటి భాష మాట్లాడకూడదని, వారు వివాదాలకు తావులేకుండా వ్యవహరించాలని హితవు పలికింది.

News February 2, 2026

నాని ‘ప్యారడైజ్’ విడుదల వాయిదా?

image

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ప్యారడైజ్’ మూవీ రిలీజ్ వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. మార్చిలో రిలీజ్ కావాల్సి ఉండగా ఈ మూవీ జూన్‌లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ ఏమైనా ఆలస్యం జరిగితే జులైలో రిలీజయ్యే అవకాశముందని వెల్లడించాయి. అయితే దీనిపై మూవీ యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేకపోవడం గమనార్హం.