News May 12, 2024

పీవోకేలో పోలీసును కొట్టి చంపిన ఆందోళనకారులు

image

పాక్ ఆక్రమిత కశ్మీర్ హింసతో అట్టుడుకుతోంది. తాజాగా ఓ పోలీసుపై అవామీ యాక్షన్ కమిటీ ఆందోళనకారులు మూకుమ్మడిగా దాడి చేయడంతో.. అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో 90 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా పెరిగిన ధరలను నిరసిస్తూ ఉచిత విద్యుత్, గోధుమలపై రాయితీ కల్పించాలని అవామీ యాక్షన్ ఆందోళనలు చేస్తోంది. ఈ విషయంలో భారత్ జోక్యం చేసుకోవాలని ఉద్యమకారుడు అంజాద్ డిమాండ్ చేశారు.

Similar News

News January 19, 2026

‘రాజాసాబ్’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?

image

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన ‘రాజాసాబ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో విడుదలైన 10 రోజుల్లో ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.139.25 కోట్లు(నెట్) వసూలు చేసినట్లు Sacnilk తెలిపింది. నిన్న ఈ సినిమా రూ.2.50 కోట్లు రాబట్టినట్లు అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో రూ.180 కోట్ల నెట్ కలెక్షన్స్ దాటినట్లు సినీ వర్గాలు తెలిపాయి.

News January 19, 2026

ECILలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

హైదరాబాద్‌లోని <>ECIL<<>>లో 20 టెక్నీషియన్, సూపర్‌వైజర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్+వైవా ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ecil.co.in

News January 19, 2026

వరిలో అగ్గి తెగులు – నివారణకు సూచనలు

image

వరి దుబ్బు చేసే దశలో అగ్గి తెగులు కనిపిస్తుంది. దీని వల్ల వరి పైర్లలో ఆకులపై నూలు కండె ఆకారం మచ్చలు కనిపిస్తాయి. ఆకుల మీద, వెన్నుల మీద గోధుమ రంగు లేదా ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. ఉద్ధృతి ఎక్కువగా ఉంటే మొక్క వెన్నువిరిగి వేలాడుతుంది. ఆకులు ఎండిపోయి తగలబడినట్లు కనిపిస్తాయి. దీని నివారణకు లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 75% 0.6gm లేదా అజాక్సీస్ట్రోబిన్+టెబుకోనజోల్ 2 ml కలిపి పిచికారీ చేసుకోవాలి.