News August 6, 2024

ముగ్గురిని కొట్టి చంపిన నిరసనకారులు!

image

బంగ్లాదేశ్‌లో విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయి. ఖుల్నాలో నిరసనకారుల దాడిలో అవామీ లీగ్ ప్రెసిడెంట్ GM మొహ్సిన్ రెజాతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారిని తరిమికొట్టేందుకు మొహ్సిన్ తన పిస్టల్‌తో ఏడు రౌండ్లు కాల్పులు జరపడంతో హింస తీవ్రమైనట్లు పోలీసులు తెలిపారు. ప్రతీకారంగా, ఆ గుంపు ఆయనతో పాటు డ్రైవర్ అలంగీర్, వ్యక్తిగత సహాయకుడు మోఫిజుల్ ఇస్లామ్‌ను కొట్టి చంపి ఇంటికి నిప్పంటించారు.

Similar News

News March 10, 2026

AP, TG ఎంత అప్పు చేశాయంటే?

image

2025-26 ఆర్థిక సంవత్సరం 9నెలల్లో AP రూ.56,072Cr, TG రూ.69,300Cr అప్పు చేసినట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. RSలో YCP MP బాబూరావు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. తొలి త్రైమాసికంలో AP రూ.26,572Cr, TG రూ.17,400Cr, రెండో క్వార్టర్‌లో AP రూ.17,600Cr, TG 32,500Cr, మూడో క్వార్టర్‌లో AP రూ.11,900Cr, TG రూ.19,400Cr ఓపెన్ మార్కెట్ ద్వారా అప్పు చేసినట్లు వివరించారు.

News March 10, 2026

ఏజెన్సీల ‘బ్లాక్’ దందా.. భారీ ధరకు సిలిండర్ల విక్రయం!

image

LPG సిలిండర్ల కొరత లేదని కేంద్రం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏజెన్సీలు సాధారణ బుకింగ్స్ యాక్సెప్ట్ చేయకుండా బ్లాక్ మార్కెట్లో సిలిండర్లను భారీ ధరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక గ్యాస్ సప్లైలో అంతరాయం ఏర్పడొచ్చని, చూసి వాడుకోవాలంటూ గేటెడ్ కమ్యూనిటీల్లో యాజమాన్యాలు అలర్ట్ SMSలు పంపుతున్నాయి.

News March 10, 2026

32,000 మంది అనర్హులకు PMKY నిధులు

image

PM కిసాన్ పథకం TGలో పక్కదారి పట్టింది. ఐటీ చెల్లింపుదారులు, భూమిని అమ్మేసిన వారు, ఇతర అనర్హులు ఇలా 32 వేలమంది లబ్ధి పొందినట్లు తేలింది. ఈ-కేవైసీలో ఆధార్ కార్డు లింక్ చేయడంతో ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టిన వారు, అధిక భూమి ఉన్నవారు, కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరికీ లబ్ధి కలిగినట్లు తేలింది. వీరికి PMKY నిలిపేశారు. పరిశీలన పూర్తయితే అనర్హులు ఇంకా తేలనున్నారు. ఈ స్కీములో ఏడాదికి ఎకరాకు ₹6వేలు ఇస్తున్నారు.