News March 21, 2024
లద్దాఖ్‌లో నిరసనలు.. 16వ రోజుకు నిరాహార దీక్ష!

కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాక్‌కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ కొన్ని రోజులుగా స్థానికులు నిరసన చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ ఇంజినీర్, సంస్కరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 16వ రోజుకు చేరింది. లద్దాఖ్‌ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ (గిరిజన హక్కుల పరిరక్షణ) పరిధిలోకి తేవాలనేది నిరసనకారుల డిమాండ్. కేంద్రంతో గతంలో చర్చలు విఫలం కావడంతో వీరు ఆందోళన కొనసాగిస్తున్నారు.
Similar News
News September 8, 2025
నాకు ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు: కాజల్

తనకు యాక్సిడెంట్ అయిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఖండించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఫన్నీగా ఉంటాయని తెలిపారు. దేవుడి దయతో తాను ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నానని చెప్పారు. తప్పుడు ప్రచారాలపై ఫోకస్ చేయకుండా నిజాలపై దృష్టి పెట్టాలని కోరారు. కాగా రోడ్డు ప్రమాదంలో కాజల్‌కు తీవ్రగాయాలు అయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
News September 8, 2025
రేపటి నుంచే ఆసియా కప్.. లైవ్ ఎక్కడ చూడాలంటే?

రేపటి నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ బరిలోకి దిగుతోంది. గ్రూప్-Aలో భారత్, పాక్, UAE, ఒమన్, గ్రూప్-Bలో శ్రీలంక, బంగ్లా, అఫ్గాన్, హాంకాంగ్ తలపడతాయి. దుబాయ్, అబుదాబి వేదికల్లో భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచులు ప్రారంభమవుతాయి. సోనీ స్పోర్ట్స్ 1, 3, 4, 5, సోని లివ్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. గ్రూపు దశలో భారత్ 10, 14, 19 తేదీల్లో మ్యాచులు ఆడనుంది.
News September 8, 2025
‘సృష్టి’ కేసు.. ముగ్గురు వైద్యుల సస్పెండ్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘<<17423890>>సృష్టి<<>>’ ఫర్టిలిటీ కేసులో ముగ్గురు ప్రభుత్వ వైద్యులు సస్పెండ్ అయ్యారు. ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో ఆంధ్ర వైద్య కళాశాల అనస్థీషియా HOD డాక్టర్ రవి, గైనకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా.ఉషాదేవి, శ్రీకాకుళం మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విద్యుల్లతను సస్పెండ్ చేశారు. ఈ ముగ్గురిపై HYDలో కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం చర్యలకు దిగింది.