News August 21, 2024
ఇ-కామర్స్ వృద్ధికి గర్వమేల: పీయూష్ గోయల్
రాబోయే పదేళ్లలో మన మార్కెట్లో సగం ఇ-కామర్స్ నెట్‌వర్క్‌లో భాగమవ్వడం గర్వించే విషయం కాదని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిజానికిది ఆందోళనకరమని చెప్పారు. ఇది ప్రిడేటరీ ప్రైసింగ్‌కు దారితీస్తుందని, సామాజిక అంతరాలు ఏర్పడొచ్చని హెచ్చరించారు. కొద్దిమందే ఆన్‌లైన్లో గ్రాసరీస్ కొనడం కొంత ఉపశమనం అన్నారు. అమెజాన్ వంటి సంస్థల పెట్టుబళ్లతో ఎకానమీకి ఏమీ ఒరగదని, దాంతో రిటైల్ స్టోర్లు మూతపడొచ్చన్నారు.
Similar News
News January 25, 2025
రాజకీయాల్లోకి త్రిష? తల్లి ఏమన్నారంటే?
సినీ నటి త్రిష త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తల్లి ఉమా కృష్ణన్ ఖండించారు. త్రిష సినిమాలను వదిలేస్తారన్న వార్తల్లో నిజం లేదని, ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. అయితే సినిమాలను వదిలేయడంపై త్రిష, ఆమె తల్లికి మధ్య వివాదం జరిగినట్లు ఇటీవల ఓ తమిళ సినిమా క్రిటిక్ పేర్కొన్నారు. దీనిపై త్రిష నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
News January 24, 2025
అప్రూవర్‌గా VSR.. జగన్ డిస్ క్వాలిఫై: బీటెక్ రవి
AP: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విజయ్ సాయి రెడ్డి అప్రూవర్‌గా మారడం ఖాయమని టీడీపీ నేత బీటెక్ రవి ట్వీట్ చేశారు. వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా డిస్ క్వాలిఫై అవుతారని జోస్యం చెప్పారు. పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగడం ఖాయమన్నారు.
News January 24, 2025
‘పతంజలి’ కారం పొడి కొన్నారా?
పతంజలి ఫుడ్స్ కంపెనీ AJD2400012 బ్యాచ్ నంబర్ కలిగిన 4 టన్నుల కారం పొడి ప్యాకెట్లను (200gms) రీకాల్ చేసింది. ఆ కారం ఆహార భద్రతా ప్రమాణాలకు లోబడి లేదని, వాటిలో క్రిమిసంహారకాలు మోతాదుకు మించి ఉన్నాయని సంస్థ సీఈఓ తెలిపారు. FSSAI ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్యాకెట్లను వినియోగదారులు ఎక్కడ కొన్నారో అక్కడే తిరిగి ఇచ్చేయాలని, మనీ రీఫండ్ చేస్తారని చెప్పారు.