News May 24, 2024
సారాను చూసి గర్వపడుతున్నా: సచిన్

తన కుమార్తె సారా క్లినికల్ & పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్లో UCL మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి మాస్టర్ డిగ్రీని పొందినట్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తెలిపారు. ‘సారాను చూస్తే తల్లిదండ్రులుగా మాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ స్థాయి వరకు రావడం అంత సులభం కాదు. నువ్వు కన్న కలలన్నీ సాధిస్తావని నమ్ముతున్నా. ఇది ఎంతో మధురమైన రోజు’ అని సచిన్ ట్వీట్ చేశారు.
Similar News
News February 6, 2026
₹120 కోట్లకు ‘టాక్సిక్’ తెలుగు రైట్స్!

KGF-2 తర్వాత వస్తున్న సినిమా కావడంతో యష్ Toxicపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను నిర్మాత దిల్ రాజుకు చెందిన SVC దక్కించుకుంది. దాదాపు ₹120 కోట్లకు (Advance Commission పద్ధతిలో) సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ఒక నాన్-తెలుగు సినిమాకు మన దగ్గర ఈ రేంజ్ డీల్ జరగడం ఇదే తొలిసారి. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీని మార్చి 19న రిలీజ్ చేయనున్నారు.
News February 6, 2026
OFFICIAL: హర్షిత్ స్థానంలో సిరాజ్

T20 WC-2026కు హర్షిత్ రాణా <<19066790>>దూరం<<>> అయ్యారని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 4న SAతో వార్మప్ మ్యాచ్ సందర్భంగా అతడికి గాయమైందని పేర్కొంది. హర్షిత్ స్థానంలో సిరాజ్‌ను తీసుకున్నామని తెలిపింది.
అప్డేటెడ్ స్క్వాడ్: సూర్య (C), అభిషేక్ శర్మ, శాంసన్, ఇషాన్, తిలక్, హార్దిక్, దూబే, అక్షర్ పటేల్, రింకూ సింగ్, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, సిరాజ్.
News February 6, 2026
అగ్ని-3 సక్సెస్.. 3 వేల KM దూరంలో ఉన్నా ధ్వంసమే!

అగ్ని-3 బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్ నుంచి టెస్ట్ ఫైర్ చేసినట్లు DRDO, రక్షణ శాఖ అధికారులు తెలిపారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష చేపట్టినట్లు చెప్పారు. అగ్ని-3 మిసైల్ 1.5 టన్నుల బరువు ఉంటుందని, 3 వేల కిలోమీటర్ల పరిధిలోని శత్రు లక్ష్యాలను ఛేదించగలదని వెల్లడించారు. అన్ని ప్రమాణాలను అందుకుంటూ లక్ష్యాన్ని చేరుకుందని తెలిపారు.


