News March 24, 2024

ఆ విషయంలో గర్వపడతా: జ్యోతిక

image

తన భర్త సూర్య చేసే సినిమాల్లో ఏ ఒక్క మహిళ పాత్రా కించపరిచేలా ఉండదని జ్యోతిక అన్నారు. అందుకు తాను గర్వపడతానని చెప్పుకొచ్చారు. కథ డిమాండ్ చేస్తే తన పాత్ర కన్నా లేడీ రోల్ నిడివి ఎక్కువున్నా ఆయన పట్టించుకోరని, అందుకు ‘జై భీమ్’ ఉదాహరణ అని జ్యోతిక చెప్పారు. తన సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యం ఉండేలా సూర్య కథలు ఎంచుకుంటారని అన్నారు. సూర్య ‘షైతాన్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Similar News

News October 3, 2024

సీఎం రేవంత్‌పై ఆరోపణలు.. కేటీఆర్‌పై ఫిర్యాదు

image

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై TPCC మీడియా, కమ్యూనికేషన్స్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి వనస్థలిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్, కాంగ్రెస్ అధిష్ఠానంపై KTR తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. మూసీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ ₹1,50,000 కోట్లను ప్రకటించారని, ఇందులో ₹25,000 కోట్లు ఢిల్లీ పెద్దలకు దోచిపెట్టేందుకేనని KTR ఆరోపించిన సంగతి తెలిసిందే.

News October 3, 2024

మండే ఎండలు.. భారీ వర్షాలు

image

APలో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది. ఓవైపు వర్షాలు కురుస్తుండగా మరోవైపు ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిన్న నెల్లూరులో 40.7 డిగ్రీలు, కావలిలో 39.8, అనంతపురంలో 38.9, తిరుపతిలో 37.6 అమరావతిలో 36.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఇవాళ ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.

News October 3, 2024

పెట్రోల్ ధరల పెంపు?

image

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు పెరిగాయి. 71 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడిచమురు ధర 2.7% పెరిగి 75 డాలర్లకు చేరింది. ప్రపంచంలో మూడో వంతు దేశాలకు ప్రస్తుతం ఇరాన్ నుంచే ఆయిల్ సప్లై అవుతోంది. ముడిచమురు ధరలకు అనుగుణంగానే మన దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చేస్తున్నాయి. ఫలితంగా పెట్రో ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా.