News December 19, 2024

క్రైస్త‌వుడిగా గ‌ర్వ‌ప‌డుతున్నా: ఉద‌య‌నిధి స్టాలిన్

image

మ‌త సామ‌ర‌స్యానికి తాను క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని, అదే స‌మ‌యంలో క్రైస్త‌వుడిగా గ‌ర్విస్తున్నాన‌ని TN Dy.CM ఉద‌య‌నిధి స్టాలిన్ పేర్కొన్నారు. మ‌తాన్ని వాడుకొని స‌మాజాన్ని విచ్ఛిన్నం చేయ‌డం, ద్వేషం నింపే కొంద‌రి చ‌ర్య‌ల‌ను ఆయన త‌ప్పుబ‌ట్టారు. ‘మీరు నన్ను క్రిస్టియ‌న్ అనుకుంటే క్రిస్టియ‌న్‌‌ని, ముస్లిం అనుకుంటే ముస్లింని, హిందువుగా భావిస్తే హిందువును’ అని అన్నారు. అన్ని మ‌తాలు ప్రేమ‌నే నేర్పుతాయ‌న్నారు.

Similar News

News December 7, 2025

జాక్ పాట్ కొట్టిన సిక్కోలు కుర్రాడు.. రూ.92 లక్షలతో ఉద్యోగం

image

శ్రీకాకుళం పట్టణం బలగ సమీపంలోని శిరిడిసాయి నగర్‌కు చెందిన విద్యార్థి మెండ హిమవంశి రూ.92 లక్షల వార్షిక వేతనంలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ అబ్బాయి ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చివరి ఏడాది చదువుతున్నాడు. దిల్లీకి చెందిన గ్రావిటన్ రీసెర్చ్ క్యాపిటల్ ఎల్.ఎల్.బి సంస్థ ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్‌కు ఎంపికయ్యాడు. పేరెంట్స్, టీచర్లు, కాలనీవాసులు కుర్రాడిని అభినందించారు.

News December 7, 2025

ఇవాళ 1,500 సర్వీసులు నడుపుతాం: ఇండిగో

image

ఇండిగో విమానాల సంక్షోభం ఆరో రోజూ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టుల్లో పదుల సంఖ్యలో సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 100 దాకా రద్దు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదు. అయితే ఆదివారం కావడంతో రద్దీ కాస్త తగ్గినట్లు సమాచారం. మరోవైపు 95 శాతం కనెక్టివిటీని పునరుద్ధరించామని ఇండిగో చెబుతోంది. ఇవాళ 1,500 సర్వీసులు నడుపుతామని తెలిపింది.

News December 7, 2025

రబీ నువ్వుల సాగుకు అనువైన రకాలు

image

☛ ఎలమంచిలి 11(TNN వరాహ): పంట కాలం 80-85 రోజులు. నూనె 52%గా ఉంటుంది. దిగుబడి ఎకరాకు 300-350 కిలోలు. ఇది ముదురు గోధుమ రంగు విత్తనం. కోస్తా, రాయలసీమ జిల్లాలకు ఈ రకం అనుకూలం.
☛ ఎలమంచిలి 17: పంటకాలం 75-80 రోజులు. దిగుబడి ఎకరాకు 340-400 కిలోలు. గింజల్లో నూనె 52.5%గా ఉంటుంది. ఇది లేత గోధుమ రంగు విత్తనం. కోస్తా, రాయలసీమ జిల్లాలకు అనుకూలం. ఆకుమచ్చ తెగులను కొంత వరకు తట్టుకుంటుంది.