News July 1, 2024
వీరి మధ్య నిలబడటం గర్వంగా ఉంది: నాగ్

‘కల్కీ’ హిట్ తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ‘‘పదేళ్ల క్రితం స్వప్న దత్, ప్రియాంక దత్, నేను కలిసి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ప్రారంభించాం. ఆ చిత్రం రిస్క్‌తో కూడుకుంది. అదనపు ఖర్చు ఆందోళనకు గురిచేసింది. కానీ పదేళ్ల తర్వాత చూస్తే మేము చేసిన ప్రతి సినిమా విజయం పొందడంతో పాటు మైలురాయిగా నిలిచాయి. వీరి మధ్య నిలబడటం గర్వంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నా’’ అని తెలిపారు.
Similar News
News April 11, 2026
స్పేస్ మిషన్‌లో ఆ 6 నిమిషాలు టెన్షన్.. టెన్షన్!

స్పేస్ మిషన్లలో <<19621417>>రీఎంట్రీ<<>> సమయంలో వచ్చే 6 నిమిషాల ‘బ్లాక్ అవుట్’ ఒక సహజ ప్రక్రియే. వ్యోమనౌక వేగానికి గాలి ఒత్తిడికి లోనై 2,760°C వేడి పుడుతుంది. దీంతో క్యాప్సూల్ చుట్టూ ఏర్పడే ‘ప్లాస్మా’ పొర రేడియో తరంగాలను అడ్డుకోవడం వల్ల భూమితో కమ్యూనికేషన్ కట్ అవుతుంది. దీన్నే ‘మినిట్స్ ఆఫ్ టెర్రర్’ అంటారు. వేగం తగ్గి ప్లాస్మా చల్లబడగానే సిగ్నల్ అందుతుంది. అప్పటిదాకా గ్రౌండ్ కంట్రోల్‌లో టెన్షన్ మామూలుగా ఉండదు.
News April 11, 2026
పడవ ప్రమాదం.. కఠిన నిబంధనలు తేవాలన్న సోనూసూద్

UP మథుర పడవ <<19620159>>ప్రమాదంలో<<>> 10 మంది ప్రాణాలు కోల్పోవడంపై నటుడు సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘గతేడాది కూడా డజన్ల కొద్దీ ఇలాంటి ప్రమాదాల్లోనే చనిపోయారు. నివారించగలిగే ఇలాంటి ప్రమాదాల్లో అమాయకులు చనిపోవడం దురదృష్టకరం. ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా లైఫ్ జాకెట్ ధరించేలా ప్రభుత్వం కఠిన నిబంధనలు తేవాలి. నిర్లక్ష్యం వీడితేనే ఇలాంటి ప్రాణనష్టాన్ని ఆపగలం’ అని X వేదికగా సూచించారు.
News April 11, 2026
వేరుశనగలో సాగుకు అనువైన అంతర పంటలు

వేరుశనగలో కంది, అనప, జొన్న, సజ్జ వంటివి అంతర పంటలుగా సాగుకు అనుకూలం. ఇవి పొడవైన వేరువ్యవస్థ కలిగి భూమి లోపలిపొరల నుంచి నీటిని తీసుకొని బెట్ట పరిస్థితులను సైతం తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి వేరుశనగ పంటతో పాటు నీడ, నీరు, పోషకాల విషయంలో పోటీపడవు. కంది, అనప పంటలైతే 6-7 వేరుశనగ వరుసల తర్వాత ఒక వరుసగా.. జొన్న, సజ్జ పంటలైతే 6 వేరుశనగ మొక్కల వరుసల తర్వాత 2 వరుసలుగా నాటి సాగుచేసుకోవచ్చు.


