News August 1, 2024

PROVED: 20ఏళ్లకే రిటైర్.. 58ఏళ్లకు రీఎంట్రీ

image

టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి జెంగ్ జియింగ్ 58ఏళ్ల వయసులో పారిస్‌ ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేశారు. ఆమె కథలో ఎన్నో మలుపులున్నాయి. 18ఏళ్ల వయసులో చైనాకు ఆడేటప్పుడు ఆమె వరల్డ్ టాప్ ప్లేయర్‌. 2సైడ్ ప్యాడిల్‌ రూల్ 1సైడ్‌గా మారడంతో చైనీస్ ఒలింపిక్ టీమ్‌కు దూరమయ్యారు. విసుగెత్తి 20ఏళ్లకే రిటైర్ అయ్యారు. ఆ తర్వాత చిలీకి షిఫ్ట్ అయిన జెంగ్ కరోనా సమయంలో మళ్లీ ఆడాలని నిర్ణయించుకుని ఆ దేశం తరఫున రీఎంట్రీ ఇచ్చారు.<<-se>>#Olympics2024<<>>

Similar News

News October 20, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

దీపావళి వేళ బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గి ₹1,30,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150 పతనమై రూ.1,198,00గా ఉంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ వెండి ధర రూ.1,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 20, 2025

‘K-Ramp’ రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే?

image

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా జైన్స్ నాని తెరకెక్కించిన ‘K-Ramp’ మూవీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. శనివారం ఇండియాలో దాదాపు రూ.2.25 కోట్లు(నెట్) వసూలు చేసిన ఈ మూవీ ఆదివారం రూ.2.85 కోట్ల వరకు రాబట్టినట్లు Sacnilk ట్రేడ్ వెబ్‌సైట్ తెలిపింది. మొత్తంగా రెండు రోజుల్లో రూ.5.1 కోట్లు వచ్చినట్లు పేర్కొంది. ఇవాళ హాలిడే నేపథ్యంలో కలెక్షన్స్ పెరిగే అవకాశమున్నట్లు అంచనా వేసింది.

News October 20, 2025

APPLY NOW: 36 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

ముంబైలోని సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ (SAMEER) 36 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్ట్‌ను బట్టి టెన్త్, ITI, NVCT/NAC, డిప్లొమా, BSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు OCT 31వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష,స్కిల్/ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, మహిళలు, PWBDలకు రూ.100. వెబ్‌సైట్:sameer.gov.in/