News February 7, 2025
గురుకులాలు, హాస్టళ్లకు నిధులివ్వండి: మంత్రి స్వామి

AP: PM-AJAY పథకం కింద ఎంపిక చేసిన 526 గ్రామాలకు రూ.110cr విడుదల చేయాలని కేంద్ర మంత్రులు వీరేంద్ర కుమార్, రామ్‌దాస్ అథవాలేను మంత్రి స్వామి కోరారు. ఢిల్లీ వెళ్లిన ఆయన 75 సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల నిర్మాణానికి రూ.245cr, గురుకులాల్లో మౌలిక వసతులకు రూ.193cr.. SC, ST అట్రాసిటీ బాధితులకు రూ.95.84cr, తదితరాలకు ఆర్థిక సాయం అందించాలన్నారు. వీటిపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు.
Similar News
News April 4, 2026
ప్లాస్టిక్‌తో హార్మోన్ల అసమతుల్యత

ప్రస్తుతకాలంలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఫుడ్స్ ప్యాక్ చేయడానికి ఎక్కువగా వీటినే వాడుతున్నారు. అయితే వీటిల్లో ఉండే బిస్పినాల్ ఏ (BPA) రసాయనం ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ సమతుల్యతను దెబ్బతీస్తుందని చెబుతున్నారు నిపుణులు. మగవాళ్లలో శుక్రకణాల సంఖ్య తగ్గడం. ఆడవాళ్లలో PCOS సమస్యలు, టైప్ 2 డయాబెటిస్, నాడీ వ్యవస్థలో సమస్యలు వస్తాయి. కాబట్టి ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
News April 4, 2026
రోజూ 5 నిమిషాలు ఇలా చేస్తే..

లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే జిమ్‌లో గంటల కొద్దీ శ్రమించాల్సిన అవసరం లేదు. జస్ట్ 5 నిమిషాల పాటు సరైన వ్యాయామాలు చేస్తే చాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా 2 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది. తర్వాత నిమిషం పాటు కపాలభాతి చేస్తే బాడీ డిటాక్స్ అవుతుంది. చివరగా భుజంగాసనం, పవనముక్తాసనం వేస్తే లివర్‌కు రక్తప్రసరణ పెరిగి మెటబాలిజం సెట్ అవుతుంది.
News April 4, 2026
మామిడి, అరటి సాగుకు అనువైన నేలలు

మామిడి సాగుకు అన్ని నేలలూ అనుకూలం. కానీ లోతైన నేలల్లో వేర్లు బాగా వ్యాపించి, చెట్టు బాగా అభివృద్ధి చెంది చాలా కాలం దిగుబడి ఉంటుంది. చౌడు, ఉప్పు, సున్నం, నీరు నిల్వ ఉండే నల్ల రేగడి నేలల్లో నాటకూడదు. ఉదజని సూచిక 7.5-8.0 మధ్య ఉండాలి. అరటి సాగుకు సారవంతమైన, నీటి వసతి, నీరు ఇంకే గుణం, తగినంత సేంద్రీయ పదార్థాల గల నేలలు మిక్కిలి అనుకూలం. సారవంతమైన ఒండ్రు నేలలు శ్రేష్ఠం. ఉదజని సూచిక 6.5-7.5 మధ్య ఉండాలి.


