News June 4, 2024
ప్రజల మద్దతు మాకే ఉందని రుజువైంది: రేవంత్

TGలో 8 ఎంపీ, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో విజయం అందించినందుకు సీఎం రేవంత్ రెడ్డి ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనను ఆశీర్వదించి తమ ఆత్మస్థైర్యాన్ని పెంచారని తెలిపారు. మరింత సమర్థవంతమైన పాలన అందించడానికి ఉత్సాహాన్నిచ్చారని పేర్కొన్నారు. ప్రజల మద్దతు తమకే ఉందని ఈ ఫలితాలతో రుజువైందన్నారు. రేపటితో కోడ్ ముగుస్తుందని, మళ్లీ ప్రజాప్రభుత్వం మొదలవుతుందని రేవంత్ స్పష్టం చేశారు.
Similar News
News November 3, 2025
కృష్ణా : రేపటి నుంచి One Health డే వారోత్సవాలు

జిల్లాలో వారం రోజులపాటు One Health Day కార్యక్రమం పేరిట అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికలను సోమవారం ఆయన ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు One Health Day వారోత్సవాలపై అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు.
News November 3, 2025
రేపు పిడుగులతో వర్షాలు: APSDMA

AP: రేపు పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. కోనసీమ, తూ.గో., ప.గో., కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించింది.
News November 3, 2025
Photo: అప్పుడు ధోనీ.. ఇప్పుడు హర్మన్

భారత మహిళా జట్టు తొలిసారి <<18182320>>ప్రపంచకప్<<>> గెలిచి దశాబ్దాల నాటి కలను సాకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలోని ఐకానిక్ గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ట్రోఫీతో కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఫొటోలకు పోజులిచ్చారు. 2011 నాటి ధోనీ పోజ్‌ను రీక్రియేట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ICC ట్వీట్ చేసింది. అంతకుముందు ‘క్రికెట్ అందరి గేమ్’ అని రాసిన టీషర్ట్ ధరించి, కప్‌తో నిద్రిస్తున్న ఫొటోను హర్మన్ షేర్ చేశారు.


