News February 28, 2025

PSL షెడ్యూల్ రిలీజ్.. పాకిస్థాన్‌కు మరో షాక్ తప్పదా?

image

పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL)-10 షెడ్యూల్‌ను PCB విడుదల చేసింది. APR 11 నుంచి మే 18 మధ్య 6 జట్లు 34 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఏటా FEB-MARలో జరుగుతుండగా ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఆలస్యమైంది. అయితే అదే సమయం(మార్చి 22-మే 25)లో IPL జరగనుండటంతో PSLను ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికీ CTలో ఘోర పరాభవం, నష్టం మూటగట్టుకున్న పాక్‌కు మరో షాక్ తప్పదని విశ్లేషకుల అంచనా.

Similar News

News February 28, 2025

రోహిత్, షమీ సహా అందరూ ఫిట్: కేఎల్

image

ఫిట్‌నెస్ సమస్యలతో మార్చి 2న కివీస్‌తో మ్యాచ్‌కు <<15595049>>రోహిత్,<<>> షమీ దూరమవుతారన్న వార్తలపై కేఎల్ రాహుల్ స్పందించారు. ‘నాకు తెలిసినంత వరకు ఆటగాళ్లంతా ఫిట్‌గా ఉన్నారు. ఎవరూ మ్యాచ్ మిస్సయ్యే ఛాన్స్ లేదు. అందరూ జిమ్, ప్రాక్టీస్ చేస్తున్నారు. పైగా సెమీస్‌కు ముందు ఒక మ్యాచే ఉన్నందున జట్టులో మార్పులు ఉండకపోవచ్చు’ అని తెలిపారు. కాగా ఇవాళ రోహిత్ గంట పాటు మైదానంలో చెమటోడ్చారు.

News February 28, 2025

రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

image

AP: రాష్ట్రంలో రేపటి నుంచి ఇంటర్ ఫస్టియర్, 3వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు మొదలుకానున్నాయి. 10.58 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉ.9 నుంచి మ.12 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటుచేశారు. అన్ని సెంటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. స్టూడెంట్స్ గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

News February 28, 2025

ప్రజలందరికీ ఉపయోగపడే ఆరోగ్యపాలసీ: రేవంత్

image

TG: రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉపయోగపడే ఆరోగ్యపాలసీని తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హెల్త్, బల్క్ డ్రగ్ విషయంలో హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉందని చెప్పారు. కొవిడ్ సమయంలో చాలా దేశాలకు హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్లు ఎగుమతి అయ్యాయని పేర్కొన్నారు.

error: Content is protected !!