News November 21, 2024
IPLతో పోటీకి PSL?
వచ్చే ఏడాది పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను IPL సమయంలో నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డు యోచిస్తోంది. PSL ఫిబ్రవరి-మార్చి మధ్యలో జరుగుతుంటుంది. వచ్చే ఏడాది ఆ సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉండటంతో IPL జరిగే మార్చి-మే సమయంలోనే PSLను జరపాలని PCB భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అగ్రస్థాయి విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండరంటూ ఫ్రాంచైజీలు ఓ లేఖలో బోర్డు వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
Similar News
News November 21, 2024
చలి పెరిగింది.. వారిని బతికించండి!
బల్గేరియా, టర్కీలోని చాలా ప్రాంతాల్లో నిరాశ్రయులైన వారిని విపరీతమైన చలి నుంచి రక్షించేందుకు ప్రజలు వారి ఇంట్లో ఉన్న జాకెట్లను రోడ్డుపై ఉన్న చెట్లపై వేలాడదీస్తారు. అవసరమైన వారు వాటిని తీసుకొని వాడుకోవచ్చు. అయితే, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరగడంతో రోడ్లపై ఉన్న నిరాశ్రయులు, యాచకులు వణికిపోతుంటారు. అందువల్ల మీకు అవసరం లేని దుప్పట్లు, స్వెటర్లు అందించి వారిని కాపాడండి. SHARE
News November 21, 2024
నమ్మండి.. ఈ పెయింటింగ్ రూ.వెయ్యి కోట్లు
న్యూయార్క్‌లోని క్రిస్టీస్ ఆక్షన్‌లో ఓ పెయింటింగ్ రికార్డు స్థాయి ధర పలికింది. ప్రముఖ కళాకారుడు రెనే మాగ్రిట్టే వేసిన పెయింటింగ్‌కు 121 మిలియన్ డాలర్లు(సుమారు రూ.1,021కోట్లు) పలికింది. ఇది వరల్డ్ రికార్డు. కాగా ‘ది ఎంపైర్ ఆఫ్ లైట్’ అనే పేరుతో ప్రదర్శనకు వచ్చిన ఈ పెయింటింగ్‌ను రాత్రి, పగలు ఒకేసారి కనిపించేలా గీశారు. గతంలోనూ రెనే వేసిన ఓ పెయింటింగ్ 79మిలియన్ డాలర్లు పలకడం గమనార్హం.
News November 21, 2024
రీరిలీజ్లపై మహేశ్‌బాబు అభిప్రాయం ఇదే!
‘దేవకీ నందన వాసుదేవ’ రిలీజ్ నేపథ్యంలో మహేశ్‌బాబుతో హీరో గల్లా అశోక్ కలిసి ట్విటర్లో #AskSSMBandAG నిర్వహించారు. ఇందులో రీరిలీజ్లపై మహేశ్ అభిప్రాయం ఏంటి? అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి సూపర్ స్టార్ స్పందిస్తూ.. ‘పోకిరితో స్టార్ట్ చేసి మొన్న మురారి వరకు రీరిలీజ్‌లు చూసినప్పుడల్లా అభిమానులు చేసిన సందడి నా పాత రోజులను గుర్తుచేశాయి. నా ఫ్యాన్స్ అందరికీ థాంక్స్’ అని చెప్పారు.