News January 12, 2026
PSLVకి ‘మూడో మెట్టు’పైనే తడబాటు!

PSLV వరుసగా రెండు ప్రయోగాల్లో (C61, <<18833915>>C62<<>>) మూడో దశలోనే విఫలమవ్వడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఈ దశలో ఘన ఇంధనం మండుతున్నప్పుడు రావాల్సిన థ్రస్ట్ తగ్గినా లేదా నాజిల్ కంట్రోల్ వ్యవస్థ వైఫల్యమైనా రాకెట్ దారి తప్పే అవకాశం ఉంటుంది. సరిగ్గా ఇదే కారణంతో C61 విఫలమైనట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు C62లోనూ అదే దశలో లోపం తలెత్తటంతో పాత తప్పిదాన్ని సరిదిద్దడంలో విఫలమయ్యారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి!
Similar News
News February 21, 2026
ప్రీ మెచ్యూర్ బేబీలకు ఈ సమస్యల ముప్పు

నెలలు నిండక ముందే పుట్టినవారు చాలా సున్నితంగా ఉంటారు. కంటికి రెప్పలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నారు నిపుణులు. ముందే పుట్టడం వల్ల వీరికి కంటి సమస్యలు, వినికిడి లోపం, శ్వాస, మెదడు సమస్యలు, గుండె జబ్బులు, నరాలు, జీర్ణశయాంతర సమస్యలు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలు వచ్చే ప్రమాదం ఎక్కువ. పుట్టినప్పుడు వారి అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు.
News February 21, 2026
ప్రీ మెచ్యూర్ బేబీల సంరక్షణ ఇలా..

ప్రీమెచ్యూర్ బేబీల సంరక్షణలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి పాలు పట్టడంతో పాటు బర్పింగ్ చేయించడం ముఖ్యం. సరైన నిద్ర కోసం అనువైన వాతావరణం సృష్టించాలి. వారికి రోజూ స్నానానికి బదులు స్పాంజ్ బాత్ చేయించాలి. వీరికి ఇన్ఫెక్షన్ల ముప్పూ ఎక్కువే. అలాగే వీరికి ఆరు నెలలు వచ్చేవరకు ప్రయాణాలు కూడా సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒక థర్మామీటర్, నెబ్యులైజర్ అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
News February 21, 2026
BREAKING: భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్

అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో భారత్‌కు పెద్ద ఊరట లభించింది. ట్రంప్ విధించిన అన్ని సుంకాలను కోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని దేశాలపై 10% టారిఫ్స్ విధిస్తూ ట్రంప్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారత్‌పై అంతకుముందు 18%గా ఉన్న టారిఫ్స్ ఇప్పుడు 10 శాతానికి(తాత్కాలికం) తగ్గాయి. దీనిని వైట్ హౌస్ అధికారులు ధ్రువీకరించారు.


