News December 30, 2024
నేడే పీఎస్ఎల్వీ సీ60 ప్రయోగం

పీఎస్ఎల్వీ సిరీస్‌లోని పీఎస్ఎల్వీ సీ60 రాకెట్‌ను ఇస్రో నేడు ప్రయోగించనుంది. నిన్న రాత్రి 8.58 గంటలకు కౌంట్ డౌన్ మొదలైంది. 25 గంటల కౌంట్ డౌన్ అనంతరం నేటి రాత్రి 9.58 గంటలకు రాకెట్ శ్రీహరికోట నుంచి స్వదేశీ సైంటిస్టులు రూపొందించిన స్పాడెక్స్ ఉపగ్రహాలను తీసుకుని నింగిలోకి దూసుకుపోనుంది. ఈ ఏడాది భారత్‌కు ఇదే ఆఖరి ప్రయోగం.
Similar News
News February 25, 2026
నిరుద్యోగులకు ALERT.. మార్చి 9 నుంచి అగ్నివీర్ ర్యాలీ

AP, TGలకు చెందిన నిరుద్యోగులకు ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది. గుంటూరులోని ANUలో ఫిజికల్ టెస్టులు ఉంటాయి. మార్చి 9, 10 తేదీల్లో మహిళలు, 12, 13 తేదీల్లో పురుషులు నేరుగా హాజరుకావొచ్చు. 2005 జులై 2-2009 జనవరి 2 మధ్య జన్మించిన, ఇంటర్/డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. సర్టిఫికెట్ల జిరాక్స్‌లు, 10 ఫొటోలు తీసుకెళ్లాలి. రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
News February 25, 2026
SBIలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

<
News February 25, 2026
‘న్యాయవ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశంపై CJI అభ్యంతరం

NCERT 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో <<19224324>>‘న్యాయవ్యవస్థలో అవినీతి’<<>> పాఠ్యాంశంపై CJI జస్టిస్ సూర్యకాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సుమోటోగా విచారణ చేపడతామన్నారు. ‘ఇది జుడీషియరీపై ఒక ప్రణాళికబద్ధమైన దాడిగా కనిపిస్తోంది. న్యాయవ్యవస్థను అప్రతిష్ఠపాలు చేసేందుకు అనుమతించబోం. ఆ కంటెంట్‌పై న్యాయమూర్తులు కలవరపడుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.


