News December 29, 2024

రేపు రాత్రి PSLV-C60 ప్ర‌యోగం

image

అంత‌రిక్షంలో నిర్దిష్ట ప్ర‌దేశంలో 2 స్పేస్‌క్రాఫ్ట్‌లను కలపడం – స్పేస్ డాకింగ్ ప్ర‌యోగాల‌కు ఉద్దేశించిన PSLV-C60ని ఇస్రో సోమ‌వారం ప్ర‌యోగించ‌నుంది. SpaDex మిష‌న్‌లో SDX01 (ఛేజ‌ర్‌), SDX02 (టార్గెట్‌) ఉప‌గ్ర‌హాల‌ను నింగిలోకి పంపుతారు. ఆదివారం రాత్రి కౌంట్‌డౌన్ ప్రారంభ‌మ‌య్యే ఈ ప్ర‌యోగాన్ని త‌రువాతి రోజు రాత్రి 8.58 గంట‌ల‌కు నింగిలోకి పంపనున్నారు. స్పేస్ డాకింగ్ ప్ర‌యోగం ఇస్రోకు కీల‌కం కానుంది.

Similar News

News January 1, 2025

న్యూ ఇయర్ రోజున తీవ్ర విషాదం

image

న్యూ ఇయర్ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపాయి. జగిత్యాల(D) ధర్మపురిలో చర్చి నుంచి బైక్‌పై ఇంటికెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టడంతో స్పాట్‌లో చనిపోయారు. మంచిర్యాల(D) దండేపల్లి KGBV వద్ద బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు, ASF(D) బెజ్జూర్‌లో పొలాల్లోకి బైక్ దూసుకెళ్లి ఇద్దరు మృతి చెందారు. అటు ఏపీలోని జమ్మలమడుగు(మ) చిటిమిటి చింతల వద్ద డివైడర్‌ను కారు ఢీకొని ఇద్దరు ప్రాణాలు విడిచారు.

News January 1, 2025

అజిత్ సినిమా వాయిదా.. గేమ్ ఛేంజర్‌కు బూస్ట్?

image

సంక్రాంతికి (JAN 10) రిలీజ్ కాబోతున్న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’కు తమిళనాడులో పెద్ద పోటీ తప్పింది. అజిత్ ‘విదాముయార్చి’ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. దీంతో అక్కడ పొంగల్ రేసులో పెద్ద సినిమాలేవీ లేవు. పాజిటివ్‌ టాక్ వస్తే ‘గేమ్ ఛేంజర్’ భారీ వసూళ్లు రాబట్టవచ్చని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. బాల దర్శకత్వం వహించిన ‘వనంగాన్’ రిలీజవుతున్నా దాని ప్రభావం GC వసూళ్లపై అంతగా ఉండకపోవచ్చని అంటున్నాయి.

News January 1, 2025

రైళ్ల టైమింగ్స్‌లో మార్పులు

image

తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే 94 రైళ్ల టైమ్ టేబుల్‌లో ఇవాళ్టి నుంచి మార్పులు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇందులో తిరుపతి-కాకినాడ, తిరుపతి-ఆదిలాబాద్, లింగంపల్లి-విశాఖ, షాలిమర్-హైదరాబాద్, హైదరాబాద్-తాంబరం సహా పలు రైళ్లు ఉన్నాయి. అలాగే మరికొన్ని రైళ్లకు కొన్ని స్టేషన్లలో కొత్తగా హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. రైళ్ల వివరాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.