News January 11, 2026
PSLV-C62 కౌంట్‌డౌన్ స్టార్ట్

AP: తిరుపతి(D) శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్‌లో PSLV-C62 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. రేపు ఉ.10.18 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది PSLVకి 64వ ప్రయోగం కాగా PSLV-DL వేరియంట్‌లో 5వ మిషన్. ఈ వాహక నౌక 44.4 మీటర్ల ఎత్తు, 260 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని ద్వారా అధునాతన భూపరిశీలన ఉపగ్రహం EOS-N1తో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు.
Similar News
News April 4, 2026
ఏప్రిల్ 4: చరిత్రలో ఈరోజు

1905: హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రాలో సంభవించిన భూకంపంలో 20,000 మంది మృతి
1942: తెలుగు రచయిత్రి చల్లా సత్యవాణి జననం
1968: ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మరణం (ఫొటోలో)
1975: మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించిన రోజు
1979: సినీ నటి సిమ్రాన్ జననం
* గనుల అవగాహన దినోత్సవం
* జాతీయ విటమిన్ ‘సి’ దినోత్సవం
News April 4, 2026
చెపాక్ చెదిరింది.. కంచుకోట చెన్నైకా? ప్రత్యర్థులకా?

IPL: ఒకప్పుడు CSK కంచుకోట అయిన చెపాక్ స్టేడియం ఇప్పుడు ఆ జట్టుకు శాపంగా మారింది. హోంగ్రౌండ్‌లో చెన్నై ఓడిపోవడం ఇది వరుసగా ఆరోసారి. చివరగా 2025 మార్చి 23న ఇక్కడ గెలిచింది. ఇక పంజాబ్ ఇక్కడ వరుసగా నాలుగుసార్లు గెలిచి ముంబై (5) తర్వాత అత్యధిక సార్లు చెన్నైని చెపాక్‌లో ఓడించిన జట్టుగా నిలిచింది. CSKతో ఆడిన లాస్ట్ తొమ్మిది మ్యాచ్‌లలో 8 సార్లు గెలిచిన PBKS హెడ్ టు హెడ్‌లో 17 విజయాలతో పైచేయి సాధించింది.
News April 4, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


