News October 24, 2024
షర్మిలను బెదిరిస్తున్న సైకో జగన్: TDP

AP: చెల్లి రాజకీయాల్లో ఉంటే సైకో జగన్ తట్టుకోలేకపోతున్నారని TDP విమర్శించింది. రాజకీయాల నుంచి తప్పుకుంటేనే ఆస్తులు రాసిస్తానని షర్మిలను బెదిరిస్తున్నారని ఆరోపించింది. ‘రాజకీయంగా నాకు అడ్డు రాకు. అప్పుడే ఆస్తులు రాసిస్తా. నన్ను ఇబ్బందులు పెడుతుంటే నీకు ఆస్తులు ఎందుకు ఇవ్వాలి? సరస్వతి సిమెంట్స్ షేర్స్ తిరిగి ఇచ్చేయండి. అమ్మపై, నీపై కేసు వేస్తున్నా’ అని షర్మిలకు జగన్ లేఖ రాశారని ట్వీట్ చేసింది.
Similar News
News December 5, 2025
భగవంతుడిపై నమ్మకం ఎందుకు ఉంచాలి?

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః|
అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్||
దేవుడు మనలోనే అంతరాత్మగా ఉంటాడు. ధనుస్సు ధరించి పరాక్రమంతో ధైర్యాన్నిస్తాడు. ప్రజ్ఞావంతుడు, ఉన్నత క్రమశిక్షణ గల ఆయన అన్ని విషయాలకు అతీతంగా ఉంటాడు. ఎవరూ భయపెట్టలేని విశ్వాసపాత్రుడు మన కార్యాలను నెరవేరుస్తూ, సకల ఆత్మలకు మూలమై ఉంటాడు. మనం ఆ పరమాత్మను గుర్తించి, విశ్వాసం ఉంచి ధైర్యంగా జీవించాలి. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News December 5, 2025
225 అప్రెంటిస్లకు దరఖాస్తుల ఆహ్వానం

పాటియాలా లోకోమోటివ్ వర్క్స్ 225 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులు అర్హులు. అప్రెంటిస్ల గరిష్ఠ వయసు 24ఏళ్లు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ముందుగా www.apprenticeshipindia.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్సైట్: https://plw.indianrailways.gov.in
News December 5, 2025
ప్రభుత్వ గుత్తాధిపత్య మోడల్ వల్లే ఈ దుస్థితి: రాహుల్

ఇండిగో విమాన సర్వీసులు రద్దవుతుండటంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘ప్రభుత్వ గుత్తాధిపత్య నమూనాకు మూల్యమే ఇండిగో వైఫల్యం. సర్వీసుల ఆలస్యం, రద్దు వల్ల సాధారణ ప్రజలు మరోసారి ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో ప్రతి రంగంలోనూ నాణ్యమైన పోటీ ఉండాలి. మ్యాచ్ ఫిక్సింగ్ గుత్తాధిపత్యాలు కాదు’ అని ట్వీట్ చేశారు. ఏడాది కిందట తాను రాసిన వ్యాసాన్ని షేర్ చేశారు.


