News February 24, 2025
వంశీపై పీటీ వారెంట్

AP: గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో జైలులో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీపై పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. రేపటితో రిమాండ్ ముగియనుండటంతో సీఐడీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఆయనపై మరిన్ని పాత కేసులను ఓపెన్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కస్టడీలో ఉన్న వ్యక్తిపై మరో కేసు నమోదు చేస్తే కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందు పీటీ వారెంట్ జారీ చేస్తారు.
Similar News
News February 24, 2025
లక్ష ఉద్యోగాల భర్తీకి సిద్ధం: టీపీసీసీ చీఫ్

TG: ఉద్యోగాల గురించి బీజేపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో భర్తీ చేసిన ఉద్యోగాలు 50 వేలు కూడా దాటలేదని విమర్శించారు. నిజామాబాద్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం 9 నెలల్లోనే 55వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పారు. మరో లక్ష ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
News February 24, 2025
KCRకు సవాల్ విసిరిన సీఎం రేవంత్

TG: కేసీఆర్ గతంలో 12 గంటల్లో సర్వే చేసి ఇప్పుడు తమ కులగణన లెక్కలు తప్పంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ఏ గ్రామంలో, ఏ వార్డులో తప్పు ఉందో చూపించాలని సవాల్ విసిరారు. ‘కేసీఆర్ సర్వేలో 51 శాతం బీసీలుంటే మా సర్వేలో 56 శాతం ఉన్నారు. ముస్లింలను బీసీల్లో చేర్చారని బండి సంజయ్ అంటున్నారు. దూదేకుల సహా 28 జాతులకు ఎప్పటినుంచో బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి’ అని పేర్కొన్నారు.
News February 24, 2025
గేదెలు కొనేందుకు రెండో పెళ్లి.. ట్విస్ట్ ఏంటంటే?

UPలో గేదెలు కొనేందుకు ఓ మహిళ రెండో పెళ్లికి సిద్ధమైంది. ఆస్మాకు తన భర్తతో విభేదాలు తలెత్తగా కొంత కాలంగా పుట్టింట్లో ఉంటోంది. యోగి ప్రభుత్వం పెళ్లి చేసుకున్న జంటలకు సాయం చేస్తుందని తెలిసి తన బంధువును రెండో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసింది. తీరా సమయానికి మొదటి భర్త బంధువులు రంగంలోకి దిగడంతో పెళ్లి ఆగిపోయింది. అనధికారకంగా ప్రభుత్వ లబ్ధి పొందేందుకు సిద్ధమైన వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.