News June 30, 2024

PUకు రూ.100 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్

image

PU ఏర్పడి 16ఏళ్లు గడుస్తున్నా కనీసం వసతులు కరవయ్యాయి. ఎక్కడ చూసినా సమస్యలు కనిపించేవి. పీయూ లైబ్రరీలో సైతం అరకొర పుస్తకాలే ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికీ స్వస్తి పలికేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఉష స్కీమ్ ద్వారా ఈ ఏడాది రూ. 100 కోట్లను కేటాయించింది. ఈ నేపథ్యంలో నిధులు విడుదల చేస్తూ వివిధ విభాగాల్లో వినియోగించేందుకు ప్రభుత్వం అనుమతించింది.

Similar News

News November 20, 2025

మహబూబ్ నగర్: ఎస్పీ కీలక ఆదేశాలు జారీ

image

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి రైతులకు కీలక సూచనలు జారీ చేశారు. రోడ్లపై ధాన్యం మారపోసి ఆరబెట్టడం వల్ల వాహనదారులకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రత్యేకంగా, ధాన్యంపై నల్లని కవర్లు కప్పడం వాటిపై రాళ్లని పెట్టడం వల్ల రాత్రి వేళల్లో వాహనదారులు ముందున్న అడ్డంకి గుర్తించలేక, భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల తగ్గింపుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.

News November 20, 2025

MBNR: బీఈడీ ఫలితాలు వెంటనే విడుదల చేయాలి

image

పాలమూరు విశ్వవిద్యాలయంకు అనుబంధంగా ఉన్న బీఎడ్ కళాశాలల నాలుగో సెమిస్టర్ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాయప్ప డిమాండ్ చేశారు. గురువారం పీయూ పరీక్షల నియంత్రణ అధికారిని ప్రవీణకు వినతిపత్రం అందజేశారు. ఫలితాలు విడుదల కాకపోవడంతో ఎంఈడీ కోర్సులు చేయడానికి అవకాశం లేకుండా పోయిందని, వెంటనే విడుదల చేయాలని కోరారు. ఫలితాలు విడుదల చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

News November 19, 2025

MBNR: U-19 క్రికెట్.. రిపోర్ట్ చేయండి

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో అండర్-19 బాల బాలికలకు క్రికెట్ జట్ల ఎంపికలను జడ్చర్లలోని మినీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. క్రీడాకారులు ఈ నెల 20న ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్, వైట్ డ్రెస్ కోడ్, పూర్తి కిట్టుతో హాజరు కావాలన్నారు. క్రీడాకారులు మహబూబ్ నగర్ పీడీ మోసీన్‌కు ఉదయం 9 గంటల లోపు రిపోర్ట్ చేయాలన్నారు.