News February 13, 2025
PUలో 20న మేధో సంపతి హక్కుల సదస్సు

ఈనెల 20న పాలమూరు యూనివర్సిటీలో “ఇంటర్నల్ క్వాలిటీ అస్సూరెన్సు సెల్” (IQAC) ఆధ్వర్యంలో మేదోసంపతి హక్కులు- డిజిటల్ శకం అనే అంశంపై జరిగే ఒరియంటేషన్ బ్రోచర్‌ను ఉపకులపతి ఆచార్య జి.ఎన్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా డాక్టర్ శంకర్ రావు ముంజం హాజరుకానున్నారు. రిజిస్ట్రార్ ఆచార్య చెన్నప్ప, ఐక్యూఏసీ డైరెక్టర్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 19, 2025
HYD: నేడు HCUలో విద్యార్థి సంఘం ఎన్నికలు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుతుంది. నేడు ఉ.9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్యాంపస్‌లో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ అనంతరం సాయంత్రం బ్యాలెట్ బాక్స్‌లను ఓట్ల లెక్కింపు కేంద్రానికి తరలిస్తారు. అనంతరం ఓట్ల లెక్కింపును ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు.
News September 19, 2025
ఎల్లంపల్లి ప్రాజెక్ట్.. 38 గేట్లు ఎత్తివేత

గురువారం కురిసిన వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టులోని 62 గేట్లలో 38 గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో మత్సకారులు, తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
News September 19, 2025
సిరిసిల్ల: పేకాటస్థావరంపై దాడులు.. ఒకరు మృతి

ఎల్లారెడ్డిపేట మం. వెంకటపూర్‌లో గురువారం రాత్రి పోలీసులు <<17757085>>పేకాటస్థావరంపై దాడులు<<>> చేశారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన చాకలి రాజయ్య(55) భయంతో పరుగులు తీశాడు. చీకటి పడ్డా అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు గాలించారు. ఈ క్రమంలో వాగు సమీపంలో రాజయ్య పడున్నాడు. కుటుంబ సభ్యులు చూసేసరికి అప్పటికే మృతిచెందాడు. పరుగులు తీయడంతోనే రాజయ్య కుప్పకూలాడని, ఈ క్రమంలో గుండెపోటు వచ్చి చనిపోయినట్లు అనుమానిస్తున్నారు.