News October 29, 2024

PU మాజీ వీసీపై ఫిర్యాదు..!

image

పాలమూరు విశ్వవిద్యాలయం మాజీ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని విద్యార్థి సంఘాలు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకృష్ణ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అభివృద్ధి పనుల్లో కమిషన్లు తీసుకున్నారని, విద్యుత్తు పరికరాలు, ఏసీలు, వాటర్ ఫిల్టర్లు కొని మాయం చేశారని ఆరోపించారు. తన బంధువులకు ఉద్యోగాలు కల్పించారని పేర్కొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

Similar News

News November 25, 2024

గత ప్రభుత్వంలో అరాచకాలు, దోపిడీలు: జూపల్లి

image

BRS ప్రభుత్వంలో అరాచకాలు, దోపిడీలు జరిగాయని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఆదివారం MBNR కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డితో కలిసి మాట్లాడారు. ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు.

News November 25, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔30న పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి రాక
✔TCC కోర్సు.. ఫీజు చెల్లించండి:DEOలు
✔రేపు PUలో హ్యాండ్ బాల్ ఎంపికలు
✔29న దీక్షా దివస్..వైస్ ఇన్‌ఛార్జిల నియామకం
✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✔కొనసాగుతున్న కుల గణన సర్వే
✔సామాజిక‌ సేవలో రెడ్డిల పాత్ర మరువలేనిది: డీకే అరుణ
✔రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవ సభలు:మంత్రి జూపల్లి
✔MBNR:’ప్రజాపాలన విజయోత్సవ’ సభ..ఏర్పాట్లపై ఫోకస్
✔26న సాఫ్ట్ బాల్ జట్ల ఎంపికలు

News November 24, 2024

MBNR: దీక్షా దివస్ జిల్లా ఇన్చార్జీలుగా మన జిల్లా నాయకులు

image

ఈ నెల 29న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జీలుగా మహబూబ్ నగర్ నేతలను నియమించారు. వికారాబాద్ జిల్లా ఇన్‌ఛార్జిగా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి, కామారెడ్డి జిల్లాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నల్గొండ జిల్లాకు MBNR మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ బండ ప్రకాష్ లను నియమించింది.