News March 21, 2024
‘PU సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు పెంచాలి’

ఈనెల 12న పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజులను ఈనెల 27 వరకు చెల్లించాలని తెలిపింది. కాగా 1, 3, 5వ సెమిస్టర్ల ఇంప్రూవ్మెంట్, రీవాల్యుయేషన్ ఫలితాలు రాకముందే 2, 4, 6వ సెమిస్టర్ల ఫీజు గడువు రావడంతో ఆయా సెమిస్టర్ల డిగ్రీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2, 4 ,6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువును పెంచాలని పీయూ యూనివర్సిటీ పరీక్షల అధికారులను కోరుతున్నారు.
Similar News
News December 5, 2025
MBNR: ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వెయ్యండి: కలెక్టర్

గ్రామపంచాయతీలో ఓటరుగా ఉండి, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి అర్హులని కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. ఇప్పటివరకు ఫారం-14 (పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు) దరఖాస్తు చేసుకున్న వారికి పోస్టల్ బ్యాలెట్ పంపడానికి ఎన్నికల యంత్రాంగం కసరత్తు చేపట్టిందని, మరో అవకాశంగా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు.
SHARE IT.
News December 5, 2025
బాలానగర్: ఉద్యోగాన్ని వదిలి.. సర్పంచి బరిలో..!

బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లికి చెందిన అంగన్వాడీ కార్యకర్త గాయత్రి ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా చేశారు. పెద్దాయపల్లి సర్పంచ్ పదవి ఎస్సీ రిజర్వేషన్ కావడంతో పోటీ చేసేందుకు గురువారం స్థానిక దేవాలయంలో పూజలు నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. ఈమె భర్త లక్ష్మయ్య గతంలో పెద్దాయపల్లి ఎంపీటీసీగా పనిచేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నడంతో హాట్ టాపిక్‌గా మారింది.
News December 5, 2025
నవాబుపేటలో 17.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గత వారం రోజులతో పోలిస్తే.. చలి తీవ్రత కాస్త తగ్గి ఉష్ణోగ్రతలు పెరిగాయి. నవాబుపేటలో 17.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. బాలానగర్ 18.4, రాజాపూర్ 18.7, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ మండలం దోనూరు 18.9, మహమ్మదాబాద్, హన్వాడ 19.5, జడ్చర్ల 20.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.


