News August 5, 2025

PU ఇంజినీరింగ్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్‌గా మొహియుద్దీన్

image

పాలమూరు యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ గౌస్ మొహియుద్దీన్ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని పాలమూరు యూనివర్సిటీ ఉపసంచాలకులు ఆచార్య జి.ఎన్.శ్రీనివాస్ మంగళవారం అందజేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News August 5, 2025

MBNR: ఆగస్టు 15 వేడుకలను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఆగస్టు 15 వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించి వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఆమె సమావేశం అయ్యారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్‌లో వేదిక వీఐపీలు, అధికారులు, మీడియా ఇతరులకు సీటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. పెరేడ్ మైదానంలో తాగునీరు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు.

News August 5, 2025

పీయూ అకాడమిక్ ఆడిట్ సెల్ కో-ఆర్డినేటర్‌గా రవికుమార్

image

పాలమూరు యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ విభాగానికి చెందిన డాక్టర్ రవికుమార్‌ను అకాడమిక్ ఆడిట్ సెల్ కోఆర్డినేటర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య జీఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ఆచార్యపూస రమేశ్ బాబు, అకాడమీ ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్ర కిరణ్ నియామక పత్రాన్ని అందజేశారు. ప్రిన్సిపల్స్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ రవికాంత్, డాక్టర్ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.

News August 5, 2025

MBNR: రాఖీ పౌర్ణమి.. ప్రత్యేక బస్సులు

image

రాఖీ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు మహబూబ్‌నగర్ రీజినల్ మేనేజర్ పి.సంతోష్ కుమార్ Way2Newsతో తెలిపారు. ఈ నెల 7 నుంచి 9 వరకు హైదరాబాద్ నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలలోని వివిధ ప్రాంతాలకు 245 అదనపు ట్రిప్పులను, ఈనెల 9 నుంచి 11 వరకు HYDకు వెళ్లేందుకు 155 అదనపు ట్రిప్పులను నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.