News November 3, 2025

PU ‘RTF కోర్సు ఫీజులు విడుదల చేయాలి’

image

PU యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల విద్యార్థులు 4 సంవత్సరాలుగా RTF ఫీజుల కోసం ఎదురుచూస్తున్నారు. ఫీజులు విడుదల కాకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులు నిలిచిపోయాయి. స్కాలర్‌షిప్‌లు, కోర్సు ఫీజులు రాకపోవడంతో విద్యార్థులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై పీయూ అధికారులు స్పందించి వెంటనే ఆర్‌టీఎఫ్‌ ఫీజులను విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

Similar News

News November 3, 2025

ఉద్యోగం ఇప్పిస్తానని రూ.45 లక్షల మోసం

image

డెన్మార్క్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని కొల్లూరు సుధాకర్ అనే వ్యక్తి రూ.45 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ దర్గామిట్టకు చెందిన ఓ బాధితుడు నెల్లూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఉద్యోగం ఇప్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అవేదన వ్యక్తం చేశారు. విచారించి న్యాయం చేయాలని కోరారు. నెల్లూరు జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

News November 3, 2025

ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడి అప్పుల పాలు.. కానిస్టేబుల్ ఆత్మహత్య!

image

TG: పోలీస్ కానిస్టేబుల్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డిలో జరిగింది. కల్హేర్‌కు చెందిన సందీప్ ఏడాదికాలంగా పట్టణ PSలో పనిచేస్తున్నారు. ఈరోజు మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఆన్‌లైన్‌ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకున్నారని, సహోద్యోగుల వద్ద అప్పులు చేశారని సమాచారం. డబ్బులు తిరిగివ్వాలని ఒత్తిడి చేయడంతో సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

News November 3, 2025

సిరిసిల్ల: చేప పిల్లల పంపిణీపై మంత్రి సమీక్ష

image

రాష్ట్రంలోని జలవనరుల్లో చేప పిల్లల పంపిణీని అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. మత్స్య శాఖపై సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.