News January 3, 2025
రైలు పట్టాలపై పబ్జీ.. ముగ్గురు యువకుల మృతి

పబ్జీ ఆట పిచ్చి బిహార్లో ముగ్గురు టీనేజీ యువకుల ప్రాణాలు తీసింది. పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన ముగ్గురు కుర్రాళ్లు మాన్సా తోలా ప్రాంతంలో రైలుపట్టాలపై పబ్జీ ఆడుతున్నారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటంతో రైలు వస్తున్న సంగతి వారు గుర్తించలేదు. వారిపైనుంచి రైలు వెళ్లిపోయింది. దీంతో అందరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
Similar News
News November 3, 2025
టిప్పర్ డ్రైవర్ గుర్తింపు

TG: రంగారెడ్డి జిల్లాలో <<18184089>>బస్సు ప్రమాదానికి<<>> కారణమైన టిప్పర్ డ్రైవర్ను పోలీసులు గుర్తించారు. అతడు మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ అని వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన లచ్చానాయక్ దగ్గర డ్రైవర్గా పని చేస్తున్నాడని తెలిపారు. హైదరాబాద్ శివారు పటాన్చెరులోని క్రషర్ మిల్లు నుంచి వికారాబాద్కు కంకర తీసుకెళ్తుండగా మీర్జాగూడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆకాశ్ కూడా చనిపోయాడు.
News November 3, 2025
US ఆంక్షల ఎఫెక్ట్.. చైనా మాస్టర్ ప్లాన్!

రష్యా ఆయిల్ కంపెనీలపై US ఆంక్షల నేపథ్యంలో చైనా తమ చమురు నిల్వలను భారీగా పెంచుకుంటోంది. 2025లో తొలి 9 నెలల్లో చైనా రోజుకు 11M బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకున్నట్లు వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇందులో 1-1.2M బ్యారెళ్లను నిల్వల కోసం దారి మళ్లించినట్లు వివరించింది. చమురు అవసరాల కోసం ఆ దేశం 70% విదేశాలపైనే ఆధారపడుతోంది. చైనా చమురు నిల్వల సామర్థ్యం 2 బిలియన్ బ్యారెళ్లకు పైగా ఉందని అంచనా.
News November 3, 2025
అడగడానికి ఇంకేం ప్రశ్నలే లేవా.. మీడియాపై సిద్దరామయ్య ఆగ్రహం

కర్ణాటకలో సీఎం మార్పు గురించి ఇటీవల జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని మీడియా ప్రశ్నించగా CM సిద్దరామయ్య సీరియస్ అయ్యారు. ‘అడగడానికి ఇంకేం ప్రశ్నలు లేవా? ప్రజలు తమకు నచ్చిన దాని గురించి మాట్లాడుకోనీయండి. హైకమాండ్ ఎవరు? సోనియాగాంధీ, రాహుల్, మల్లికార్జున ఖర్గే చెప్పారా దీని గురించి’ అని ప్రశ్నించారు. బిహార్ ఎన్నికల తర్వాత క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణపై అధిష్ఠానంతో మాట్లాడతానని తెలిపారు.


