News June 18, 2024

రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది: భువనేశ్వరి

image

AP: రాష్ట్రంలో హింసాత్మక పాలన పోయి ప్రజాపాలన మొదలైందని CM చంద్రబాబు భార్య భువనేశ్వరి అన్నారు. ఎక్కడ చూసినా ప్రజలు తామే గెలిచామన్న సంతోషంలో ఉన్నారని ఆమె ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో ప్రజల ఆవేదన చూశా. వారి బాధలు విని, సమస్యలు తెలుసుకున్నా. కూటమి ప్రభుత్వం ప్రజలకు ప్రజాపాలన అందిస్తుంది. ఇకపై రాష్ట్ర ప్రజలకు అంతా మంచే జరుగుతుంది. ఆ నమ్మకం నాకుంది’ అని ఆమె పేర్కొన్నారు.

Similar News

News November 21, 2025

మహిషి కన్నీరు కలిసిన జలం

image

శబరిమల యాత్రలో ముఖ్య ప్రాంతాల్లో ‘అళుదా నది’ ఒకటి. మహిషిని అయ్యప్ప స్వామి వధించిన స్థలం ఇదేనని ప్రతీతి. స్వామి బాణాలకు తాళలేక మహిషి రోదిస్తూ కన్నుమూశాడు. అప్పుడు కార్చిన కన్నీరు ఈ నదిలో కలిసిందట. అందుకే దీన్ని అళుదా(రోదించడం) నది అని అంటారు. అయ్యప్ప భక్తులు ఈ నదిలో పవిత్ర స్నానం ఆచరించి, 2 రాళ్లను తీసుకొని, యాత్ర మార్గంలోని కల్లిడుకుండ్రుం వద్ద విసిరి తమ యాత్రను కొనసాగిస్తారు. <<-se>>#AyyappaMala<<>>

News November 21, 2025

యూనస్ టచ్ కూడా చేయలేడు: షేక్ హసీనా కొడుకు

image

బంగ్లాదేశ్‌లో రాజ్యాంగవిరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా కొడుకు సజీబ్ వాజెద్ అన్నారు. ‘యూనస్ నా తల్లిని చంపలేరు. కనీసం టచ్ కూడా చేయలేరు. బంగ్లాలో చట్టబద్ధమైన పాలన వచ్చిన తర్వాత అంతా మారిపోతుంది’ అని చెప్పారు. 140 రోజుల్లోనే విచారణ పూర్తి చేశారని, న్యాయ ప్రక్రియను పూర్తిగా అపహాస్యం చేశారని మండిపడ్డారు. హసీనాకు <<18311087>>మరణశిక్ష <<>>విధిస్తూ ICT తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

News November 21, 2025

లీజుకు బంగారం.. ఇప్పుడిదే ట్రెండ్-1

image

అంతర్జాతీయ ఉద్రిక్తతలు, పండుగల సీజన్ నేపథ్యంలో ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో బడా ఇన్వెస్టర్లు కొత్త ట్రెండ్‌కు తెరతీశారు. తమ వద్ద ఉన్న బంగారాన్ని అద్దె/లీజుకు ఇస్తున్నారు. బంగారు బిస్కెట్లు, కడ్డీలు వంటి వాటిని ఆభరణాల వ్యాపారులు, రిఫైనర్లు, తయారీదారులకు ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. తద్వారా బంగారంపై 2-7% ఆదాయం పొందుతున్నారు. ఇటు ధరల పెరుగుదల, అటు లీజ్ ద్వారా లాభపడుతున్నారు.