News November 21, 2024
డిసెంబర్ 3న ప్రజాపాలన బహిరంగ సభ?

TG: ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 3న ప్రజాపాలన బహిరంగ సభ నిర్వహించాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్లు సమాచారం. హైదరాబాద్లో జరిగే ఈ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల్లో ఒకరిని ఆహ్వానించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీనితో పాటు నామినేటెడ్ పదవులు, పలు కార్పొరేషన్ ఛైర్మన్ల భర్తీపై నిన్న పార్టీ కీలక నేతలతో సీఎం చర్చించినట్లు సమాచారం.
Similar News
News December 4, 2025
లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి గురువారం ఆలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కళ్యాణోత్సవాలను విజయవంతం చేయడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News December 4, 2025
సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్(73) అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలోని లోధి రోడ్డులో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బీజేపీ తెలిపింది. సీనియర్ న్యాయవాది అయిన కౌశల్ గతంలో మిజోరం గవర్నర్గా పనిచేశారు. కాగా 2019 ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. సుష్మా-కౌశల్ దంపతులకు బన్సూరి స్వరాజ్ అనే కూతురు ఉన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీ ఎంపీగా సేవలందిస్తున్నారు.
News December 4, 2025
కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులకూ నెలసరి సెలవులు

ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులకూ నెలసరి సెలవులను(ఏడాదికి 12) వర్తింపజేస్తూ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అదనంగా 1.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రైవేట్ రంగాల్లోని మహిళలకు(18-52 ఏళ్లు) పెయిడ్ లీవ్ను తప్పనిసరి చేస్తూ గత నెల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. కాగా బిహార్, ఒడిశా రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు, కేరళలో యూనివర్సిటీ సిబ్బందికి నెలసరి సెలవులు ఇస్తున్నాయి.


