News July 17, 2024
‘ప్రజావాణి’ దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి: DGP

TG: ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ‘ప్రజావాణి’ ద్వారా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసు అధికారులను DGP జితేందర్ ఆదేశించారు. పీఎస్‌లలో వచ్చే ఫిర్యాదులపై వెంటనే కేసులు నమోదు చేయాలని, ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. హిస్టరీ షీట్లను సమీక్షించాలని, ఆయుధాల లైసెన్స్‌ల జారీపై జాగ్రత్త వహించాలన్నారు. SC, STలు, మహిళలు, శాంతి భద్రతలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
Similar News
News April 6, 2026
రేపు పిడుగులతో వర్షాలు!

AP: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రేపు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని తెలిపింది. అలాగే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందంది. ఇవాళ అనంతపురం(D) తెరన్నపల్లిలో 42, కడప(D) రాజుపాలెంలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది.
News April 6, 2026
BREAKING: పంచాయతీ కార్యదర్శుల పే స్కేల్ తగ్గింపు

AP: గ్రామ పంచాయతీల <<19452294>>పునర్వర్గీకరణ<<>> తర్వాత గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శుల పేస్కేల్‌ను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో వీరికి రూ.28,280-89,720 ఉండగా ఇకపై రూ.25,220-80,910గా ఉంటుందని పేర్కొంది.
News April 6, 2026
లాకప్ డెత్ కేసు.. తొమ్మిది మంది పోలీసులకు మరణ శిక్ష

తమిళనాడులో 2020లో జరిగిన తండ్రి-కుమారుల లాకప్ డెత్ కేసుపై మదురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో తొమ్మిది మంది పోలీసులకు మరణ శిక్ష విధించింది. లాక్డౌన్లో 2020 జూన్ 19న జయరాజ్, ఆయన కుమారుడు జే బెన్నిక్స్‌ను పోలీసులు లాకప్‌లో వేశారు. విచారణ పేరుతో హింసించడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. అనుమతించిన దాని కంటే ఎక్కువ సమయం మొబైల్ షాప్ నడిపారని వీరిని అరెస్ట్ చేయగా ఆ ఆరోపణల్లో నిజం లేదని తేలింది.


