News August 6, 2024
ప్రజారోగ్యానికి పెద్ద పీట వేయాలి: చంద్రబాబు

AP: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజారోగ్యానికి పెద్ద పీట వేయాలని CM చంద్రబాబు అధికారులకు సూచించారు. కలెక్టర్లతో సదస్సులో ఆసుపత్రుల పనితీరుపై పలు సూచనలు చేశారు. రాబోయే రోజుల్లో ప్రైవేటు ఆసుపత్రులతో ప్రభుత్వ ఆసుపత్రులు పోటీ పడేలా పనిచేయాలన్నారు. ప్రైవేటుకు ధీటుగా సామాన్యుడికి మెరుగైన వైద్యం అందుబాటులోకి రావాలన్నారు. ఖర్చు చేసిన ప్రతి రూపాయికి తగిన వైద్యం అందాలని సీఎం ఆకాంక్షించారు.
Similar News
News November 27, 2025
BC విద్యార్థులకు ఉచిత సివిల్స్ కోచింగ్: సవిత

AP: BC విద్యార్థులకు DEC 14నుంచి ఉచిత సివిల్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అందించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ‘వంద మందికి శిక్షణిచ్చేలా BC భవన్లో ఏర్పాట్లు చేస్తున్నాం. వైట్ రేషన్ కార్డున్నవారు అర్హులు. DEC 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 7న అర్హత పరీక్ష, 11న ఫలితాలు వెల్లడిస్తారు. 100 సీట్లలో BCలకు 66, SCలకు 20, STలకు 14 సీట్లు కేటాయిస్తున్నాం. మహిళలకు 34% రిజర్వేషన్లు అమలుచేస్తాం’ అని తెలిపారు.
News November 27, 2025
టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. CTET నోటిఫికేషన్ విడుదల

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CTET-2026 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ctet.nic.inలో నేటి నుంచి అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 18, 2025. పరీక్ష ఫిబ్రవరి 8, 2026న జరుగుతుంది. దేశవ్యాప్తంగా 132 నగరాల్లో 20 భాషల్లో ఈ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో, రాష్ట్రస్థాయిలో టీచర్ ఉద్యోగాలు సాధించడానికి CTET అవకాశం కల్పిస్తుంది.
News November 27, 2025
బహు భార్యత్వ నిషేధ బిల్లును ఆమోదించిన అస్సాం

బహు భార్యత్వ(పాలిగామీ) నిషేధ బిల్లును అస్సాం అసెంబ్లీ ఇవాళ పాస్ చేసింది. దీని ప్రకారం 2 లేదా అంతకు మించి పెళ్లిళ్లు చేసుకుంటే ఏడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. వివాహం సమయలో ఇప్పటికే ఉన్న జీవిత భాగస్వామి గురించి దాచిన వారికి పదేళ్ల శిక్ష పడనుంది. ‘ఈ బిల్లు ఇస్లాంకు వ్యతిరేకం కాదు. నిజమైన ఇస్లామిక్ ప్రజలు దీన్ని స్వాగతిస్తారు. బహుభార్యత్వాన్ని ఇస్లాం అంగీకరించదు’ అని CM హిమంత బిశ్వ శర్మ తెలిపారు.


