News August 20, 2024

రేపటి నుంచి కాళేశ్వరంపై బహిరంగ విచారణ

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ రేపటి నుంచి బహిరంగ విచారణను ప్రారంభించనుంది. విజిలెన్స్ డీజీ సీవీ ఆనంద్‌ను 4 గంటలపాటు విచారించిన కమిషన్, పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. త్వరలోనే కేసీఆర్, హరీశ్ రావు, మాజీ సీఎస్ సోమేశ్‌ కుమార్‌కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మేడిగడ్డ ఎందుకు కుంగిందన్న అంశంపైనే కమిషన్ ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News March 13, 2026

పౌల్ట్రీ పరిశ్రమపై వార్ ఎఫెక్ట్.. గుడ్ల ధర పతనం

image

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం దేశీయ పౌల్ట్రీ పరిశ్రమపై పడింది. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతి కావాల్సిన కోడిగుడ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల పోర్టుల నుంచి కోడి గుడ్ల లోడ్ వెనక్కి రావడంతో పౌల్ట్రీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. యుద్ధానికి ముందు ఒక కోడి గుడ్డు ధర రూ.7 వరకూ ఉండగా.. ప్రస్తుతం అది కొన్నిచోట్ల రూ.4, రూ.3.50కు పడిపోయింది.

News March 13, 2026

పంట రుణాల పరిమితి ఖరారు

image

TG కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ FY2026-27కి గాను పంట రుణాల పరిమితిని ఖరారు చేసింది. ఎకరా వరి సాధారణ సాగుకు ₹48,000, SRIకి ₹38K, విత్తనోత్పత్తికి ₹51K, పత్తి(నీటి వసతి) ₹52K, వర్షాధారం ₹50K, విత్తనోత్పత్తికి ₹1.50Lగా నిర్ణయించింది. మిరప(సాధారణ సాగు) ₹90K, మల్చింగ్ ₹లక్ష, మొక్కజొన్న(₹38K, ₹32K, స్వీట్‌కార్న్ ₹43K), కంది(₹27K, ₹23K, ₹25K), పసుపు ₹92K, టమాటా ₹58K, ఉల్లి ₹49K, పెసలు (₹20K, ₹22K)గా ఉంది.

News March 13, 2026

డాల్బీ ఫార్మాట్‌లో ‘పెద్ది’

image

బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్-జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అడ్వాన్స్‌డ్ డాల్బీ ఫార్మాట్‌లో విడుదల(ఏప్రిల్ 30) కానున్న తొలి టాలీవుడ్ మూవీగా నిలవనుంది. దీంతో హైపర్ రియలిస్టిక్ వీడియో, అద్భుతమైన సౌండ్‌తో చిత్రాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఫార్మాట్‌లో ఇప్పటి వరకు వార్-2, కాంతార-2, GOAT చిత్రాలు రిలీజయ్యాయి.