News October 3, 2025

ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకూడదు: మంత్రి జనార్దన్

image

AP: ఉత్తరాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో R&B శాఖ అధికారులతో మంత్రి BC జనార్దన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉన్న రోడ్లు గండ్లు, కోతకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.

Similar News

News October 3, 2025

సీఎం ఇంటికి బాంబు బెదిరింపు

image

తమిళనాడు సీఎం స్టాలిన్ నివాసం, గవర్నర్ భవనం, రాష్ట్ర బీజేపీ ఆఫీస్, నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్ సాయంతో తనిఖీలు నిర్వహించారు. పేలుడు పదార్థాలు దొరక్కపోవడంతో అది ఫేక్ కాల్ అని తేల్చారు. ఈ నేపథ్యంలో చెన్నై అల్వార్‌పేటలోని CM ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

News October 3, 2025

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

image

TG: రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఈ నెల 5న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డిలో అక్కడక్కడ వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు మంగళవారం వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News October 3, 2025

‘కాంతార ఛాప్టర్-1’కు తొలి రోజు భారీ కలెక్షన్స్!

image

కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘కాంతార ఛాప్టర్-1’కు తొలి రోజు భారీ కలెక్షన్స్ వచ్చినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ప్రీమియర్స్‌తో కలిపి వరల్డ్‌వైడ్‌గా రూ.65 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. కూలీ(రూ.65 కోట్లు), ఛావా(రూ.31 కోట్లు), సికందర్(రూ.26 కోట్లు), సైయారా(రూ.22 కోట్లు) చిత్రాల తొలిరోజు కలెక్షన్లను అధిగమించిందని వెల్లడించాయి.