News November 7, 2024

టెస్టు జట్టులో పుజారాకు చోటు అత్యవసరం: ఉతప్ప

image

టెస్టు జట్టులో ఛతేశ్వర్ పుజారాకు ఇంకా చోటు ఉందని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప పేర్కొన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అతడిని ఎంపిక చేయకపోవడం భారత మేనేజ్‌మెంట్ చేసిన తప్పిదమని అభిప్రాయపడ్డారు. ‘ఈ జట్టులో పుజారాకు చోటు ఇవ్వడం ప్రస్తుతం ఓ అవసరం. ఓపెనింగ్ నుంచి 6వ ప్లేస్ వరకు అందరూ దూకుడుగా ఆడే ఆటగాళ్లే. పుజారా, ద్రవిడ్, విలియమ్సన్ వంటి ఆటగాళ్లకు టెస్టుల్లో చోటు ఎప్పుడూ ఉంటుంది’ అని వివరించారు.

Similar News

News November 25, 2025

ఎన్పీడీసీఎల్‌లో 17 మంది ఇంజనీర్లకు పదోన్నతులు

image

ఎన్పీడీసీఎల్ (NPDCL) సీఎండీ వరుణ్ రెడ్డి సంస్థలోని పలువురు ఇంజనీర్లకు పదోన్నతులు కల్పిస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం సర్కిల్ పరిధిలో ముగ్గురు ఏడీఈలకు డీఈలుగా, 14 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు ఏడీఈలుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన రాందాసు కార్పొరేట్ ఆఫీస్‌కు, రమేష్ వైరా డివిజన్‌కు బదిలీ అయ్యారు. ఈ చర్యతో విభాగాల పనితీరు మెరుగుపడుతుందని సంస్థ తెలిపింది.

News November 25, 2025

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 68,615 మంది భక్తులు దర్శించుకోగా 27,722 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు సమకూరినట్లు టీటీడీ తెలిపింది.

News November 25, 2025

దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు.. వచ్చే నెల 3న ఏర్పాటు

image

TG: రాష్ట్రంలో దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు కానున్నాయి. డిసెంబరు 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వీటిని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. గత నెలలో గ్రామాల్లో మహిళా సమాఖ్యల ద్వారా లక్షన్నర మంది దివ్యాంగ మహిళలు, పురుషులను సెర్ప్‌ గుర్తించింది. మహిళల అధ్యక్షతన ఒక్కో స్వయం సహాయక సంఘంలో 5 నుంచి 10 మంది వరకు సభ్యులు ఉండాలని నిర్దేశించింది.